సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో చేస్తోన్న గుంటూరు కారం సంక్రాంతి విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రమోషన్లు కూడా ఊపందుకుంటున్నాయి. సెకండ్ సాంగ్ రేపు రాబోతోంది. ఇక ఈ సాంగ్ ప్రోమోలో ఒక విషయాన్ని స్పష్టం చేసారు. ఇందులో శ్రీలీల గ్లామర్ ను బాగానే వాడుకున్నారు. త్రివిక్రమ్ తన హీరోయిన్లను టిపికల్ స్టైల్ లో చూపిస్తాడు. పూజ హెగ్డేను త్రివిక్రమ్ ఎలా వాడాడో మనం చూసాం.
ఇప్పుడు శ్రీలీల గ్లామర్ ను అదే తరహాలో వాడుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది శ్రీలీల నటించిన నాలుగు చిత్రాలు విడుదలవ్వగా అందులో మూడు పల్టీ కొట్టాయి. వచ్చే ఏడాది గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లు ఉన్నాయి. గుంటూరు కారం జనవరిలో విడుదలవుతుంది. ఉస్తాద్ ఎప్పుడు వస్తుంది అన్నది ఎవరికీ తెలీదు.