Switch to English

చంద్రబోస్‌కు ఘన సత్కారం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ ని ఘనంగా సత్కరించారు. ప్రముఖ సినీ నటుడు శ్రీ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో I FLY STATION ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక లో కార్యక్రమం జరిగింది. చంద్రబోస్ రచించిన గీతాల గురించి వారే స్వయంగా తమ మనసులోని మాటలను తెలియజేస్తూ , ఆ పాటను ప్రముఖ గాయనీ గాయకులు గీతామాధురి దీపు పి విఎన్ఎస్ రోహిత్, సత్య యామిని, అతిథి భావరాజు, సాయి చరణ్ లతో పాడించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరు అయ్యారు. వారిలో మురళీ మోహన్ , సంగీత దర్శకురాలు శ్రీలేఖ, రచయిత రామ జోగయ్య శాస్త్రి, జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో చంద్రబోస్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం అంటూ.. తన అన్నయ్యను వేదికపై పరిచయం చేశారు. తనను అన్నయ్య ఎంతో ప్రోత్సహించాడని గుర్తు చేసుకున్నారు. ఇక తన మిత్రులకు కూడా ధన్యవాదాలు అని చెప్పాడు. ప్రదీప్ గారు మీ రుణం నేను తీర్చుకోవాలి. మీకు సరస్వతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ వేదికపై ఎన్నో వందల ఆడియోలు రిలీజ్ చేశాం. ఎవరు హీరో అంటే.. పాట హీరో.. సంగీతం హీరో… సాహిత్యం హీరో. నేను నా మొదటి పాటకు శ్రీలేఖ గారు అద్భతమైన బాణి ఇచ్చారు. అప్పుడు నేను ఇంజినీరింగ్ చదువుతున్నాను. అప్పుడు నన్ను రామానాయుడు గారు ఎంతో ప్రోత్సహించారు. 95లో మొదలైన నా ప్రయాణం… 2023 వరకు 28 సంవత్సరంలో 800 సినిమాల్లో 3600పైగా పాటలు రాశాను. నాకు నా జీవితానికి పరిపూర్ణత తీసుకువచ్చిన సంతవత్సరం 2023, ఫిబ్రవరిలో గోల్డెన్ గ్లోబ్, రెండవదిహాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్, మూడవది క్రిటిక్స్ అవార్డ్స్, నాలుగవది ఆస్కార్, ఐదవది బాంబే హంగామా అవార్డు, ఆరవది జాతీయ పురస్కారం. ఇలా ఈ ఏడాదిలో ఆరు అవార్డుల వర్షం కురిసింది. తెలుగుకి వెయ్యి ఏళ్ల సాహిత్య చరిత్ర ఉంది. రెండువేల సంవత్సరాల భాష చరిత్ర ఉంది. తెలుగులో పుట్టాం.. తెలుగులో పెరిగాం… తెలుగులో ఎదుగుతాం, తెలుగులో బతుకుతాం, తెలుగులో చనిపోతాం.. ఇక నాటు నాటు సాంగ్ రాసే అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి, కీరవాణి గారికి ఈ పాటను అలపించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గారికి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గారికి ధన్యవాదాలు. నాటు నాటు పాటను 45 నిమిషాల్లో రాసినప్పటికీ.. దాన్ని పూర్తి చేయడానికి ఏడాదికి పైగా పట్టింది. అంత సహనంగా ఉన్నందుకు ప్రతిఫలం దక్కింది. ప్రతి గాయకుడికి, ప్రతి దర్శకుడికి, ప్రతి సంగీత దర్శకుడికి ధన్యవాదాలు. మురళి మోహన్ గారు 83 ఏళ్లు శాశ్వత యువకులు. ఆయన హుషారుగా పాట వింటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చిన శాస్త్రి గారు.. మా ఇంటి ఎదురే ఉంటారు. ఆయన రావడం గొప్ప విశేషం. మీరందరూ లేకుండే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. భార్యని అర్థంగి అంటారు. నేను అర్ధంగి అనను పూర్ణంగి అంటాను. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారణం అయిన స్పాన్సార్స్ కు చేతులెత్తి నమస్కారం చేేస్తున్నాను.

ముఖ్య అతిథిగా విచ్చేసిన మురిళి మోహన్ గారు మాట్లాడుతూ… వేదికపై అనేక మంది పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ చూస్తే.. చివరి వరకు కూర్చోని చూడాలని అనిపిస్తుంది. చంద్రబోస్ మొట్ట మొదటి సారిగా తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకువచ్చిన మహానీయుడు. భారతీయ చిత్రసీమ ఆయన్నీ చూసి గర్వపడుతుంది. ఒకే సంవత్సరంలో అస్కార్ అవార్డు.. అదే సంవత్సరంలో జాతీయ అవర్డు తీసుకువచ్చిన ఏకైనా లిరిసిస్ట్ చంద్రబోస్. ఆయన గెలుపు వెనుక సతిమణి ఉన్నారు. వీరి ఆట పాట అద్భుతంగా ఉన్నారు కాబట్టి… వీరు ఆదర్శంగా ఉన్నారు. సుచిత్ర మా పక్కింటి అమ్మాయి. వాళ్ల నాన్న గారు మ్యూజిక్ డైరెక్టర్. ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్ అదర్. ఇక ఆస్కార్ అవార్డుకు వెళ్లే ముందు చంద్రబోస్ సుచిత్రను పిలిచారు. కానీ ఆమె రాను మీరు వెళ్లండని చెప్పింది. దానికి కారణం పూజ గదిలో నుంచి బయటకు రాకుండా పూజలు నిర్వహించింది.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ… సభా ముఖంగా చంద్రబోస్ గారికి అభినందనలు. చాలా గర్వంగా అనిపిస్తుంది. నా మనసు ఉప్పోంగిపోతుంది. ఎవరి ప్రయాణం అయినా చిన్నగా మొదలు అవుతుంది. పెద్దగా ముగుస్తుంది. నిరంతరం నిత్య విద్యార్థిగా ఉంటూ.. చంద్రబోస్ ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన జీవితం గొప్పది. ఆదర్శం అంటూ కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....