Switch to English

RRR: ప్రపంచ సినిమాపై తెలుగు ముద్ర..! ‘ఆర్ఆర్ఆర్’ కు ఏడాది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

RRR: ఓ సినిమా నిర్మాణానికి 5ఏళ్ల సమయం చాలా విలువైనది. కథ ఫైనల్ కావడం దగ్గర నుంచి నటీనటుల ఎంపిక, షూటింగ్, విడుదల.. వీటన్నింటికీ ఓ తపస్సే చేస్తారు మేకర్స్. అయితే.. గతంలో 3-6 నెలల్లో షూటింగ్ పూర్తయితే.. ఇప్పుడు ఏడాది సమయం పడుతోంది. ఇందుకు భిన్నంగా ఓ తెలుగు సినిమా మొదలై విడుదలకు 4ఏళ్లకుపైగా సమయం పట్టడం విశేషం. ఆ సినిమానే ఆర్ఆర్ఆర్ (RRR) . రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్ (Ntr), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సంచలనాలు నమోదు చేసింది. ఇద్దరు స్టార్స్ హీరోలతో తెరకెక్కిన సినిమా అంచనాలను మించి ప్రపంచవ్యాప్తంగా 1250కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నిర్మాత దానయ్య 400కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమాలో భారీతనం కనిపిస్తుంది. నేటితో ఆర్ఆర్ఆర్ విడుదలై ఏడాది పూర్తి చేసుకుంటోంది.

ఆస్కార్ వరకూ పయనం..

2022 మార్చి 25న విడుదలైన సినిమా ప్రభంజనం సరిగ్గా ఏడాది వరకూ కొనసాగుతూనే ఉంది. తొలి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న సినిమా ఈ ఏడాది మార్చి 12న ప్రపంచ సినీ వేదికపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ముగిసింది. హీరోల పాత్రలు, రాజమౌళి (Rajamouli) దర్శకత్వ ప్రతిభ ఇవన్నీ ప్రేక్షకులను ధియేటర్లకు పరుగులు పెట్టించాయి. రామ్ చరణ్ (Ram Charan)-ఎన్టీఆర్ (Ntr) ఇంట్రో, ఇంటర్వెల్ ఫైట్, కొమురం భీముడో పాట, రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్, క్యారెక్టర్ లో వేరియేషన్స్, అల్లూరి సీతారామరాజు గెటప్, క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకుల్ని మెప్పించాయి. నాటు-నాటు పాట, అచ్చ తెలుగు సాహిత్యం సినిమాను ప్రపంచ వేదికపై ఆర్ఆర్ఆర్ ను సగర్వంగా నిలబెట్టాయి. ఇద్దరు హీరోలపై హాలీవుడ్ అటెన్షన్ క్రియేట్ అయింది.

ఘనమైన రికార్డులు..

నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కావడంతో హాలీవుడ్ (Hollywood) ప్రముఖులకు, ప్రపంచ ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ పరిచయమైంది. జపాన్ లో సినిమాకు దక్కిన ఆదరణ ఏకంగా 25ఏళ్ల క్రితం రజినీకాంత్ ముత్తుతో నెలకొల్పిన రికార్డులను ట్రిపుల్ మార్జిన్ తో బద్దలు కొట్టేలా చేసింది. చైనాలో కూడా సినిమా విడుదలై ప్రేక్షకాదరణ పొందితే భారతీయ సినిమాల్లో కలెక్షన్లపరంగా నెంబర్ వన్ స్థానంలో ఉండటం ఖాయం. గోల్డెన్ గ్లోబ్, హెచ్ సీఏ, ఆస్కార్ అవార్డు, లాస్ ఎంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోయేషన్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ ఆన్ లైన్ లతోపాటు మరెన్నో అందుకుని ఆర్ఆర్ఆర్ నెక్స్ట్ లెవల్ కు వెళ్లిపోయింది. నాటు-నాటు పాట స్టెప్పుకు ప్రపంచమే ఊగిపోయంది. ఆస్కార్ (Oscar) వేదికపై తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చి, భారతీయ సినిమా స్థాయిని మరోస్థాయికి తీసుకెళ్లిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...