Kotamreddy Sridhar Reddy: ‘వైసీపీ (YSRCP) నన్ను బహిష్కరించడం కాదు.. 2024 ఎన్నికల తర్వాత ఆ పార్టీనే పూర్తిగా డిస్మిస్ అవుతుంది. ప్రజలంతా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల్లో వచ్చిందే స్పష్టమైన ప్రజా తీర్పు.. వచ్చే ఎన్నికల్లో ఇదే పునరావృతం కాబోతోంది’ అని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
‘వైసీపీ ఎమ్మెల్యేలంతా లోలోపల ఉడికిపోతున్నారు. కొందరు బహిరంగంగానే బయటకి వస్తున్నారు. త్వరలో రాబోయే రాజకీయ సునామీలో వైసీపీ (YSRCP) శాశ్వతంగా కనుమరుగు కావడం తథ్యం. ప్రజా సమస్యలపై గళమెత్తిన నన్ను అనుమానించారు.. అవమానించారు. నాకు సంబంధించిన ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే చూశారు. అందుకే రెండు నెలల క్రితమే పార్టీకి దూరమయ్యాను. ఇప్పుడు పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ఇప్పుడు ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేస్తాను. వైసీపీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) అన్నారు.