Ajay Devgan:ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు తనవల్లే వచ్చిందని సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) తండ్రిగా కీలకపాత్ర పోషించిన బాలీవుడ్ (Bollywood) నటుడు అజయ్ దేవగన్ (Ajay Devgan) కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇదంతా సరాదాగా చేసినవి. వివరాల్లోకి వెళ్తే..
అజయ్ దేవ్ గన్ (Ajay Devgan) హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భోళా’. తమిళ ఖైదీకి రీమేక్ గా తెరకెక్కింది. చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అజయ్ దేవగన్ (Ajay Devgan) .. కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. వ్యాఖ్యాత అజయ్ దేవగన్ తో ‘ఆర్ఆర్ఆర్ (RRR) కు ఆస్కార్ వచ్చింది. సినిమాలో మీరూ నటించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి’ అని అడగ్గా..
‘ఆర్ఆర్ఆర్ (RRR) కు ఆస్కార్ నావల్లే వచ్చింది. ఎందుకంటే నాటునాటు పాటలో నేను డ్యాన్స్ వేయలేదు కాబట్టి. నేనే డ్యాన్స్ చేసుంటే పరిస్థితి ఏంటో తెలుసు కదా’ అని సరాదా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ షోలో ఉన్నవారంతా నవ్వులు చిందించారు. అజయ్ దేవగన్ (Ajay Devgan), టబు (Tabu) కీలకపాత్రలు పోషించిన భోళా ఈనెల 30న విడుదల కానుంది.
850160 734812If I must say something, then nothing will stop the chatter within 902853