Switch to English

బీజేపీ టచ్ లో 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

6, 8, 14, 16, 18.. ఇవేవీ క్రికెట్ స్కోర్లు కావు. తమతో టచ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఇదేనంటూ పలు సందర్భాల్లో కమలనాథులు చెప్పిన అంకెలివి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 18 మంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలో వారంతా కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ పార్టీ డిప్యూటీ ఇన్ చార్జి సునీల్ దేవదార్ తాజాగా వెల్లడించారు. ‘‘పలు అవినీతి ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు బలంగా విశ్వసిస్తున్నారు. బాబు సన్నిహితులతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అవినీతికి పాల్పడినట్టు వారు నమ్ముతున్నారు. ఈ కారణంతోనే వారంతా బీజేపీలోకి రావాలని భావిస్తున్నారు’’ అని సునీల్ ఓ వార్తాసంస్థతో పేర్కొన్నారు.

ఇటీవల ఆయన మచిలీపట్నం వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గురించి మాట్లడారు. రెండేళ్లలో ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని ఉద్ఘాటించారు. తాజాగా అదే మాటను మళ్లీ చెప్పడం చూస్తుంటే తెరవెనుక ఏమైనా జరుగుతుందా లేక నేతలను తమ పార్టీలకు చేర్చుకునేందుకు ఆడుతున్న మైండ్ గేమా అనేది తెలియక టీడీపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం గత ప్రభుత్వ అవినీతిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఏ విభాగంలో ఎంత మేర అవినీతి జరిగింది? దాని వెనుక ఉన్న పెద్దలెవరో 45 రోజుల్లో తేల్చాలంటూ ఏకంగా మంత్రివర్గ ఉపసంఘం వేయడంతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఈ పరిణామాలన్నీ టీడీపీ ఎమ్మెల్యేల్లో అయోమయం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. తమతో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ ఉన్నారని లీకులిస్తున్నారు. తాజాగా 18 మంది బీజేపీలో చేరడానికి మొగ్గు చూపిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఇది నిజం కాదని, ఈ విషయంలో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి నిజమేనని, అయితే ఇంతమంది ఎమ్మెల్యేలు మాత్రం చేరే ప్రసక్తే లేదని అంటున్నారు. ఈనెల 6న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ గుంటూరులో జరిగే గురుదక్షిణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ సందర్భంగా పలువురు సీనియర్ నేతలో పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆలోగా టీడీపీ ఎమ్మెల్యేలపై మైండ్ గేమ్ ద్వారా ఒత్తిడి తెచ్చి సాధ్యమైనంత ఎక్కువ మందిని ఆకర్షించాలన్నది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...