Switch to English

ఊహించిందే.! పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటనపై కేసు నమోదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోలీస్ కేసు నమోదయ్యింది.! తెనాలికి చెందిన శివ అనే వ్యక్తి తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన అధినేత మీద ఫిర్యాదు చేశాడు.

నవంబర్ 5వ తేదీన పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి ఇప్పటం వెళుతూ వాహనం మీద ప్రమాదకరమైన రీతిలో కూర్చున్నారనీ, ఆయన కాన్వాయ్ వేగంగా వెళ్ళడం వల్ల తనకు ప్రమాదం సంభవించిందనీ, బైక్ మీద నుంచి పడిపోయానని సదరు వ్యక్తి శివ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడట.

పోలీసులు అందుకున్న పోలీసులు మోటర్ వెహికల్స్ యాక్ట్ 177, ఐపీసీ 336 సెక్షన్ కింద కేసు నమోదు చేశారట. పవన్ కళ్యాణ్ అలాగే పవన్ కళ్యాణ్ ప్రయాణించిన వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ మీద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం వల్లనే తాను బైక్ మీద నుంచి పడ్డానని ఫిర్యాదులో శివ పేర్కొనడం గమనార్హం.

ఇప్పటం గ్రామ ప్రజలు, జనసేన పార్టీ ఆవిర్భావ వేడుక జరుపుకునేందుకు తమ భూముల్లో అవకాశం కల్పిచిన సంగతి తెలిసిందే. అది గిట్టని వైసీపీ, ఇప్పటం గ్రామంపై కొరడా ఝుళిపించింది. బస్సులు కూడా రాని గ్రామానికి ఏకంగా 120 అడుగుల మేర రోడ్లను వెడల్పు చేయాలని సంకల్పించింది. ఆ వంకతో, జనసేన మద్దతుదారులు.. అందునా, కాపు సామాజిక వర్గానికి చెందినవారి ఇళ్ళను కూల్చివేశారనేది ప్రధాన ఆరోపణ.

ఈ క్రమంలో జనసేన అధినేత ఇప్పటం వెళ్ళారు. బాధితుల్ని పరామర్శించారు. అంతే కాదు, బాధిత కుటుంబాలకి లక్ష రూపాయల చొప్పన ఆర్థిక సాయమూ ప్రకటించారు. అంతకు ముందు తమ పార్టీ ఆవిర్భావ సభకు సహకరించిన ఇప్పటం గ్రామ అభివృద్ధికి 50 లక్షల రూపాయల సాయం ప్రకటించారు జనసేనాని.

ఆ సొమ్ముల్ని వైఎస్సార్ కళ్యాణ మండపానికి ఇచ్చేయాలంటూ అధికార పార్టీ ఒత్తిడి తీసుకురాగా, దాన్ని గ్రామస్తులు, అధికార పార్టీ ఒత్తిళ్ళను లెక్క చేయలేదు.

ఇదిలా వుంటే, ఇప్పటం వెళ్ళే క్రమంలో జనసేనానిని అదుపు చేయడానికి మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు ప్రయత్నించారు. దాంతో, జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కొంత దూరం కాలి నడకన వెళ్ళారు. ఆ తర్వాత పోలీసులు దిగొచ్చారు. దాంతో, వాహనంపైకెక్కి కూర్చుని.. అలాగే ఇప్పటం గ్రామం వరకూ వెళ్ళారు జనసేనాని.

దీనిపై నేసనల్ మీడియాతో మాట్లాడిన కొందరు వైసీపీ మంత్రులు, పవన్ కళ్యాణ్‌పై కేసులు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించినట్లూ చెప్పారు. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఫిర్యాదుదారుడ్ని పోలీసులు రంగంలోకి దించినట్లున్నారన్నది జనసేన విమర్శ. సినిమా స్టోరీని మించిపోయింది కదా.. ఈ పోలీస్ కేస్ హంగామా.! మరి, ఈ కేసు విషయమై జనసేనాని రియాక్షన్ ఎలా వుంటుందో ఏమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...