Switch to English

చేతులో జోడించి ‘దండం’ పెట్టే పరిస్థితెందుకు వచ్చింది జగన్ సారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

‘మీతో మా బంధం రాజకీయాలకు అతీతం..’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతే కాదు, చేతులు జోడించి మొక్కి ‘మీ ఆశీస్సులు కావాలి’ అని కూడా అడిగారు.!

ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలతో రాజీనామా చేయించి, తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ.? విభజన హామీలు నెరవేర్చండి మహాప్రభో.. అంటూ చేతులు జోడించి, నమస్కరిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ.? ఆ జగన్ మోహన్ రెడ్డికీ, ఈ జగన్ మోహన్ రెడ్డికీ ఏంటి తేడా.?

‘మేం కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం..’ అని ఇదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నినదించారు. నిజానికి, ఆ పౌరుషం.. ఆ తెగువ.. కేవలం అధికారం కోసం వేసిన ఎత్తుగడ తప్ప, వాటిల్లో నిజాయితీ లేదు. అందుకే, అప్పుడు మెడలు వంచేస్తామని చెప్పి.. ఇప్పుడు మెడలు వంచేసుకుని ‘ఆశీస్సులు’ కోరుతున్నారన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.

ఒక విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించాలి. అదేంటంటే, విశాఖ వేదికగా ప్రధాని సమక్షంలోనే ప్రత్యేక హోదా సహా పలు అంశాల్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు మరి. ఎనిమిదేళ్ళ క్రితం తగిలిన గాయంతో ఆంధ్రప్రదేశ్ విలవిల్లాడుతోందనీ, ఇంకా ఆ గాయం నుంచి కోలుకోలేదని వైఎస్ జగన్ చెప్పారు.

‘మీరు అదనంగా ఇచ్చే ప్రతి రూపాయీ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది.. ఎంతో మేలు చేస్తుంది..’ అని ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు వైఎస్ జగన్.

అదనంగానా.? అదెలా వుంటుంది.? రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి.. రాలేదు.! రైల్వే జోన్ రావాలి.. వస్తుందో లేదో తెలియదు.! కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు.. వీటి విషయంలో కేంద్రం పట్టించుకోవడంలేదు. పైగా, విశాఖ స్టీలు ప్లాంటుని అమ్మేసుకుంటోంది కేంద్రం. అదనంగా రావడం సంగతి దేవుడెరుగు.. వున్నవాటినీ కేంద్రం లాక్కుంటోందాయె.!

అయినాగానీ, ఆనాటి చేవ చచ్చిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో. అధికారం వస్తే.. బలం పెరగాలి.. ఇంకాస్త ధైర్యం ప్రదర్శించాలి. తెగువ చూపించాలి. చేతులు జోడించిన నమస్కరించే స్థాయికి పడిపోవడమేంటి.? ఎక్కడో తేడా కొడుతోంది కదా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...