Switch to English

శిరీష్ నువ్వు కొంటె కృష్ణుడు, నేను రౌడీ రాముడు : బాలయ్య

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

చాలా కాలం గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. రాకేష్ శశి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా నవంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. దానికి నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు.

ఈ ఈవెంట్ లో ఒక ఫన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ హైలైట్ గా నిలిచింది. అల్లు శిరీష్, బాలయ్యను కొన్ని ప్రశ్నలు అడగడం, దానికి బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానాలు చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది.

ముందుగా బాలయ్య: నన్ను ప్రశ్నలు ఏం అడుగుతావయ్యా, నా గురించి అందరికీ తెలుసు, వాళ్ళని (ఫ్యాన్స్)ని అడుగు నా గురించి.

శిరీష్: సర్, మా సినిమా టైటిల్ ఉర్వశివో రాక్షసివో. ప్రతీ అమ్మాయిలో ఒక ఊర్వశి, రాక్షసి ఉంటుందని అంటాను. అలాగే మీ సినిమాల్లో పనిచేసిన హీరోయిన్స్ లో విజయశాంతి, సిమ్రాన్, నయనతార, శృతి హాసన్.. వీళ్లల్లో ఊర్వశి ఎవరు, రాక్షసి ఎవరు?

బాలయ్య: శృతి హాసన్ రాక్షసి, నయనతార ఊర్వశి.

శిరీష్: సర్, మరి సిమ్రాన్?

బాలయ్య: నువ్వు రెండే అడిగావు. ఊర్వశి, రాక్షసి… నేను రెండూ చెప్పేశా. ఇంకా అడుగుతావేం. తిలోత్తమ, రంభ… వాళ్ళు వేరు.

శిరీష్: మీరు చేసిన సింహం అని టైటిల్ ఉన్న సినిమాల్లో సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, జై సింహా, సింహా, లక్ష్మి నరసింహ, ఇప్పుడు రాబోతోన్న వీర సింహా రెడ్డి. ఇది కాకుండా ఇంకో సింహం టైటిల్ ఉంది సర్, అదేంటో చెప్పండి.

బాలయ్య: బొబ్బిలి సింహం ఉందిగా.

శిరీష్: అది కాకుండా ఇంకోటి చెప్పండి..

బాలయ్య: అందులో కూడా సింహం ఉంది కదా.

శిరీష్: సింహం నవ్వింది అనే సినిమా మీరు చేసారు కదా సర్.

బాలయ్య: అందుకే పోయింది. సింహం నవ్వడమేంటి… నువ్వు నా చేత ప్లాప్ సినిమా పేరు చెప్పిద్దామని ప్లాన్ వేశావయ్యా.

శిరీష్: అలా ఏం లేదు సర్. ఇక మీకు, నాకు రెండు కామన్ విషయాలు ఉన్నాయి, అవేమిటో చెప్పండి సర్.

బాలయ్య: నేను మాత్రం బయట బాలయ్యని, ఇంట్లో మొగుడ్ని. నీ పెళ్లి సంగతి చెప్పు. అన్నట్లు నీది మిథున రాశి కాదయ్యా మర్చిపోయాను.

శిరీష్: అవును సర్.

బాలయ్య: మనిద్దరం ఒక్కటే. నీలో కొంటె కృష్ణుడు ఉన్నాడు. నేనేమో రౌడీ రాముడు.

శిరీష్: అన్ స్టాపబుల్ లో ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ చేసారు. అందులో మీకు చాలా కష్టం అనిపించిన ఎపిసోడ్ ఏది సర్?

బాలయ్య: అబ్బే, వచ్చే గెస్ట్ లకు ఇబ్బంది కానీ నాకేం ఇబ్బంది అడిగేవాడిని. ఏమైనా అడిగేస్తాను.

శిరీష్: ఇక ఆఖరి ప్రశ్న. మీ సినిమాల్లో ఏదైనా రోల్ లో నేను నటించే అవకాశముందా?

బాలయ్య: సరే. పరశురామ్… ఏదైనా మంచి పాత్రలు వస్తే చేద్దాం.

సుమ: కంగ్రాట్స్ శిరీష్, ఎంత ధైర్యంగా అడిగేశావు శిరీష్.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...