Switch to English

జనసేన పద్ధెనిమిది ప్రశ్నలు.! ఏపీ మహిళా కమిషన్ వద్ద సమాధానమేదీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రశ్నకు ప్రశ్న సమాధానం కానే కాదట.. అలాగని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏవో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నోటీసు పంపిన వాసిరెడ్డి పద్మ, జనసేన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని సంకటంలో వున్నారిప్పుడు.!

పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి ముఖ్యమంత్రి సహా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. అందరూ మాట్లాడుతున్నారు. మాట్లాడటమేంటి, రాష్ట్ర ప్రజలు వైసీపీకి 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది, కేవలం పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి చర్చించేందుకే అన్నట్లు తయారైంది వ్యవహారం.

విశాఖలో వైసీపీ మూడు రాజధానుల పేరుతో గర్జన నిర్వహించి, అక్కడా జనసేన అధినేత పెళ్ళిళ్ళ గురించే అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశారు. అయినాగానీ, అలా తనను విమర్శిస్తోన్నవారిపై జనసేన అధినేత స్పందించకూడదట. పైగా, స్పందించినందుకు మహిళా కమిషన్ నుంచి నోటీసులట.

‘దొంగతనానికి వచ్చి.. అనుకోకుండా అత్యాచారం చేసేశారు..’ అంటూ రాష్ట్ర హోంమంత్రి ఓ దారుణ అత్యాచార ఘటనపై తేలిగ్గా మాట్లాడితే మహిళా కమిషన్ ఏం చేసింది.? అని జనసేన ప్రశ్నించకూడదట. ‘అత్యాచారాలకు తల్లి పెంపకమే లోపం..’ అని రాష్ట్ర హోంమంత్రి అంటే, రాష్ట్ర మహిళా కమిషన్ ఎక్కడుంది.?

ఇలా జనసేన మొత్తంగా 18 ప్రశ్నలు సంధించింది. జనసేన వీర మహిళలైతే వందల సంఖ్యలో ప్రశ్నలు సంధించారు సోషల్ మీడియా వేదికగా. తన కుమార్తె హత్యాచారానికి బలైపోతే.. ఓ తల్లి ఏళ్ళుగా న్యాయం కోసం ఎదురుచూస్తోంది. ఆ తల్లి కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఆ తల్లికి మహిళా కమిషన్ ఏం సమాధానమిస్తుంది.?

సమాధానం చెప్పలేని పరిస్థితి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మది తప్ప.. జనసేనది కానే కాదు. తన మీద వస్తున్న విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జస్ట్ సమాధానం చెప్పారంతే. ‘గంట, అరగంట..’ అంటూ మంత్రులు, మహిళలతో వికృత చర్యలు చేస్తే తప్పులేదుగానీ, ఆ విషయాన్ని జనసేన అధినేత ప్రస్తావిస్తే.. రాష్ట్ర మహిళా కమిషన్, రివర్స్‌లో జనసేన అధినేతకే నోటీసులు పంపిందాయె.!

రాష్ట్ర మహిళా కమిషన్ కాస్తా.. వైసీపీకి ఊడిగం చేసే మహిళా కమిషన్‌లా మారిపోయిందన్న విమర్శలకు తొలుత సమాధానం చెప్పాల్సి వుంటుంది వాసిరెడ్డి పద్మ.

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....