Switch to English

ఎల్లలు దాటిన కీర్తి.. తెలుగు సినిమా అద్భుతం రాజమౌళి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

తెలుగు సినిమా ఖ్యాతిని, బిజినెస్, కమర్షియల్ రేంజ్ పెంచిన హీరోలుగా, పౌరాణిక, జానపద చిత్రాల ద్వారా సీనియర్ ఎన్టీఆర్ కి, పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్, హైయెస్ట్ పారితోషికం వంటి వాటిల్లో చిరంజీవికి పేరు. ఆ తర్వాత తెలుగు సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకి పేరు. వీరంతా భారతీయ సినిమాలో తెలుగు సినిమా ఘనతను చాటారు. కానీ.. తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ సినీ పటంపై నిలిపిన ఘనత మాత్రం ఖచ్చితంగా ఎస్ ఎస్ రాజమౌళికే దక్కుతుంది. ప్రస్తుతం ఈ పేరు రాష్ట్రాలు, దేశం సరిహద్దులు దాటి హాలీవుడ్ కి హాట్ టాపిక్ గా మారింది. ఇంకా చెప్పాలంటే మహా మహా హాలీవుడ్ దిగ్దర్శకులకు ఒక ఛాలెంజ్ లా నిలుస్తోంది. జాగ్రత్తగా గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు.. అనే సినిమా డైలాగ్ లా సినిమాను తీర్చిదిద్దడం రాజమౌళి స్పెషాలిటీ. ఒక సినిమాకి టైటిల్ దర్శకుడు పేరు పెట్టడం అనేది రాజమౌళి క్రేజ్ కు నిదర్శనం. దర్శకులకు క్రేజ్ ఉండటం సహజమే కానీ.. హీరోల మాదిరిగా ఒక దర్శకుడికి మాస్ ఇమేజ్ అంటే దాసరి తర్వాత అయనకు మాత్రమే సొంతమైందని చెప్పాలి. నేడు రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా ఓ కథనం.

ఎప్పటికప్పుడు లెక్కలు మారుస్తూ..

ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క.. ఇదొక సినిమాలో డైలాగ్. కానీ.. రీల్ లైఫ్ లో దీనిని ఎప్పటికప్పుడు నిజం చేస్తున్నారు రాజమౌళి. ముఖ్యంగా 21 ఏళ్ల ఆయన కెరీర్లో 2009 వరకూ ఒక లెక్క.. అప్పటినుంచి మరో లెక్క. అప్పటివరకూ కమర్షియల్ సినిమాలతో హిట్లు, బ్లాక్ బస్టర్స్ కొట్టిన రాజమౌళి.. రామ్ చరణ్ తో తెరకెక్కించిన మగధీరతో తన మాయాజాలం పవర్ ఏంటో చూపించాడు. ఒక్క తెలుగులోనే 100కోట్ల కలెక్షన్లు రుచి చూపించిన సినిమా. దక్షిణాదిన ప్రభంజనం. దేశీయ సినిమా తెలుగు సినిమా వైపు చూసిన తరుణం. అక్కడి నుంచి రాజమౌళి లెక్కలు మారిపోయాయి. ఈగ, బాహుబలి, బాహుబలి-2 తో రాజమౌళి ఒక బ్రాండ్. ఒక దర్శకుడిగా ఆడియన్స్, ట్రేడ్ లో సృష్టించిన సంచలనం ఒక అద్భుతం.

ఎల్లలు దాటిన కీర్తి..

బాహుబలి-2 తో అత్యధిక కలెక్షన్లలో ఆసియాలో రాజమౌళి పేరు మోగితే.. అర్అర్అర్ తో యావత్ ప్రపంచాన్ని తన గురించి ఆలోచించేలా చేశాడు దర్శకధీరుడు. ఇటీవల అమెరికాలో అయనకు దక్కిన అపూర్వ ఆదరణే ఇందుకు నిదర్శనం. భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనే స్థాయి నుంచి.. రాజమౌళి సినిమా అనే స్థాయికి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడంటే అతిశయోక్తి కాదు. భారత్ తరపున కాకపోయినా.. సినిమా క్రేజ్ దృష్ట్యా ఏకంగా ఆర్. ఆర్.ఆర్ సినిమాను ఆస్కార్ బరిలో నిలపడం.. దాదాపు అన్ని కేటగిరీలో ఖచ్చితంగా రాజమౌళి ఘనతే. త్వరలో మహేశ్ తో తెరకెక్కే సినిమా విజయవంతం కావాలని.. మహాభారతం తెరకెక్కించాలనే ఆయన కల నిజమవ్వాలని ఆశిస్తూ.. అయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తోంది తెలుగు బులెటిన్.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...