Switch to English

కళ్లతో నట విశ్వరూపం.. విమర్శలకు సరైన సమాధానం.. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

చిరంజీవి ఎక్కువగా రీమేక్స్ ఎందుకు చేస్తారు.. కొత్త కథలు చేయొచ్చు కదా..? ఇది సినీ ప్రేమికులకు ఒక ప్రశ్న అయితే.. యాంటీ ఫ్యాన్స్ కు వెటకారం. ‘రీమేక్స్ అయితే మాత్రం నేనెంత కొత్తగా కనిపిస్తాను.. ఎంత అద్బుతంగా చేయగలను.. మంచి కథలను ఇక్కడా మనం చప్పొచ్చు.. ఇందులో తప్పేముంది..?’ ఇది చిరంజీవి సమాధానం. విజయదశమి సందర్భంగా నేడు విడుదలయిన గాడ్ ఫాదర్ లో చిరంజీవి ఇదే సమాధానాన్ని తెరపై అత్యద్బుతంగా చూపించారు. మళయాళ లూసిఫర్ పాయింట్ ను తీసుకుని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి.. బలమైన స్క్రీన్ ప్లే తో దర్శకుడు మోహన్ రాజా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. చిరంజీవి వంటి దిగ్గజాన్ని తెరపై చూపిన విధానంతో మెగాభిమానులకు పూనకాలే వస్తున్నాయి. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి తనదైన ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకుని ఇచ్చిన హిట్ ‘గాడ్ ఫాదర్’.

కళ్లతో నట విశ్వరూపం.. విమర్శలకు సరైన సమాధానం.. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’

మోహన్ రాజా మాయాజాలం

‘చిరంజీవి కంటే బాగా నటించేది ఎవరైనా ఉంటే ఆయన కళ్లు మాత్రమే’ అనేది మెగాభిమానుల మాట. సినిమాలో చిరంజీవి చేసిన అద్భుతం ఇదే. హీరోయిన్, ఆయన మార్క్ పాటలు, డ్యాన్సులు.. లేకున్నా కళ్లతో చిరంజీవి చేసిన అభినయం మహాద్భుతం. సినిమాలో చిరంజీవి కంటే ఆయన కళ్లు డామినేట్ చేయడమే ఇందుకు నిదర్శనం. కేవలం నటనకు మాత్రమే అవకాశం ఉన్న పాత్రలో చిరంజీవి తన హావభావాలతో సినిమాను రక్తి కట్టించడం ఒకెత్తు అయితే.. ఫ్యాన్స్, ఆడియన్స్ ను మెప్పించడం మరొక ఎత్తు అని చెప్పాలి. విమర్శలు, విమర్శకులకు చిరంజీవి ఎప్పుడూ తన పనితోనే సమాధానం చెప్తారు. తన కెపాసిటీ ఏంటో పూర్తిగా తెలిసిన చిరంజీవి.. ఆచార్య దెబ్బకు ఎదురైన విమర్శలకు ఎక్కడా ఎఫెక్ట్ కాకుండా తన పనిపైనే దృష్టి పెట్టి.. గాడ్ ఫాదర్ తోనే తిరుగులేని సమాధానం చెప్పారు.

కళ్లతో నట విశ్వరూపం.. విమర్శలకు సరైన సమాధానం.. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’

రామ్ చరణ్ ఆలోచనలే..

ఈ సినిమా వెనుక వెన్నపూసలా నిలిచింది రామ్ చరణ్. మళయాళంలో సినిమా చూసి తండ్రికి చూపించి సినిమా చేయాలని సూచించింది.. దర్శకుడిగా మోహన్ రాజాను కూడా సజెస్ట్ చేసింది రామ్ చరణే. తెలుగులో 20ఏళ్ల క్రితం సినిమా చేసిన మోహన్ రాజా ఈ సినిమాతో తన సత్తా చాటారు. చిరంజీవిపై మోహన్ రాజాకు ఇంత అభిమానముందా అనేంతగా అంటే అతిశయోక్తి లేదు. ఇక సల్మాన్ ఖాన్ ను కూడా తెరపైకి తెచ్చింది రామ్ చరణ్. ఆయన గెస్ట్ అప్పీయరెన్స్ అనేకంటే మెగా ఫ్యామిలీపై ఆయన అభిమానం చూపారని చెప్పాలి. తమన్ మ్యూజికల్ వండర్ సినిమాలో ప్రేక్షకులు లీనమయ్యేలా చేశాడు. మొత్తంగా గాడ్ ఫాదర్ తో మెగాభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చేశారు చిరంజీవి. తెలుగు చిత్ర సీమకు మరో కొత్త రికార్డులను అందించారు. నాడు అంత ఫ్లాప్ ఎదుర్కొన్నా.. ఇప్పుడు ఇంత హిట్ ఇచ్చినా చిరంజీవి ఏమీ మాట్లాడరు.. ఆయన సినిమానే మాట్లాడుతుంది. అదే ‘చిరంజీవి’.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...