Switch to English

నాగార్జున బర్త్ డే స్పెషల్: అప్పుడైనా.. ఇప్పుడైనా టాలీవుడ్ మన్మధుడు ‘నాగార్జున’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఏ రంగంలోనైనా ఓ కుటుంబానికి ఉన్న ఘన చరిత్రను వారసత్వంగా నిలబెట్టడం బాధ్యత. సినిమా, రాజకీయం.. ఏదైనా వ్యక్తుల వారసులకు ఇది సవాలే అయినా కొందరు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని వారసత్వాన్ని ఘనంగా చాటుతారు. అటువంటి వారిలో తెలుగు సినీ రంగంలో అక్కినేని నాగార్జున ప్రముఖంగా నిలుస్తారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు వేసిన బలమైన పునాదిపై ఆయనే ఓ భవనం కడితే.. నాగార్జున దానిని ఇంద్రభవనం చేశారు. నటన, నిర్మాణం, వ్యాపారం.. ఇలా అక్కినేని వంశానికి చెందిన ప్రతి రంగంలో నాగార్జున బలమైన ముద్ర వేశారు. 80,90ల్లో నాగార్జున తెలుగు చిత్రసీమలోని నలుగురు అగ్రహీరోల్లో ఒకరిగా యువసామ్రాట్ గా నిలిచారంటే తనదైన నటనతో రాణించడమే కారణం. హ్యాండ్సమ్ లుక్, స్టయిల్ తో అప్పటి యూత్ కు నాగార్జునే హాట్ ఫేవరేట్. నేడు ఆయన పుట్టినరోజు.

నాగార్జున బర్త్ డే స్పెషల్: అప్పుడైనా.. ఇప్పుడైనా టాలీవుడ్ మన్మధుడు  ‘నాగార్జున’

కొత్తవారికి ప్రోత్సాహం..

టెక్నీషియన్లను ప్రోత్సహించడంలో నాగార్జున ముందుండే ఉండేవారు. రామ్ గోపాల్ వర్మ, గీతాకృష్ణ, కిరణ్, కల్యాణ్ కృష్ణ వంటి వారికి దర్శకులుగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. తెలుగుకు వర్కౌట్ కాని ట్రాజెడిక్ ఎండింగ్ గీతాంజలిలో చేసి సక్సెస్ అయ్యారు. ఫ్యామిలీ, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు.. అన్నమయ్య, శ్రీరామదాసు, శిర్డిసాయి, ఓం నమో వేంకటేశాయ వంటి భక్తి సినిమాలు చేశారు. గగనం, ఆకాశ వీధిలో వంటి ప్రయోగాత్మక సినిమాలు.. ఆజాద్ వంటి సందేశాత్మక చిత్రాలూ చేశారు. దీంతో సక్సెస్ ఫుల్ హీరోగానే కాకుండా తండ్రి సినీ వారసత్వాన్ని ఘనంగా చాటారు. అక్కినేని సినీ వారసత్వాన్ని మూడో తరంగా కుమారులు నాగ చైతన్య, అఖిల్ ను సినీ రంగ ప్రవేశం చేయించారు. అఖిల్ ను ఏడాది వయసులోనే సిసింద్రీ సినిమాలో ప్రధాన పాత్రలో పరిచయం చేసి ముందు తరానికి బీజం వేశారు.

నాగార్జున బర్త్ డే స్పెషల్: అప్పుడైనా.. ఇప్పుడైనా టాలీవుడ్ మన్మధుడు  ‘నాగార్జున’

నటనతోపాటు వ్యాపారంలోనూ..

నటన మాత్రమే కాకుండా నిర్మాణ రంగంలోనూ నాగార్జున తనదైన ముద్ర వేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతను భాగస్వామిగా పర్యవేక్షిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా, టెలివిజన్ ప్రొడక్షన్, సినిమా నిర్మాణం వంటి బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. పలు యాడ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ రియాలిటీ షో మీలో ఎవరు కోటేశ్వరుడుకు ఓసారి, బిగ్ బాస్ కు 2019 నుంచి హోస్ట్ గా ఉన్నారు. క్రీడలపై ఆసక్తితో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్, మహీ రేసింగ్ టీమ్, ఇండియన్ సూపర్ లీగ్, కేరళ బ్లాస్టర్స్ ను ప్రమోట్ చేశారు. ప్రస్తుతం ఆయన నటించిన ఘోస్ట్, బ్రహ్మాస్త్ర సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ సందర్భంగా నాగార్జున మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ బర్త్ డే విశెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...