Switch to English

‘సమ్మతమే’.. ప్రేక్షకుల సమ్మతంతో మంచి హిట్ అవుతుంది: హీరో కిరణ్ అబ్బవరం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “సమ్మతమే”. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించారు. సినిమా జూన్ 24న విడుదలవుతున్న సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

ఇంటికి మళ్ళీ ఆడపిల్ల వస్తే..

దర్శకుడు గోపీనాథ్, నాదీ నాలుగేళ్ళ ప్రయాణం. అన్నదమ్ముల్లా ఉంటాం. హైదరాబాద్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటి నుంచి పరిచయం. సినిమా పట్ల ఇద్దరి ప్యాషన్ ఒక్కటే. నేను హీరోగా చేస్తుంటే.. గోపి కథ రాస్తున్నాడు. స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమయ్యాకే ‘సమ్మతమే’ స్టార్ట్ చేశాం. సింపుల్ పాయింట్ తో వినోదం, యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాం. సినిమాలో హీరో పేరు కృష్ణ. తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. ఆ ఇంటికి మళ్ళీ ఆడపిల్ల వస్తే.. అనేది కాన్సెప్ట్. పెళ్లి పై శుభసంకల్పం వున్న క్యారెక్టర్ కి పెళ్లి చూపుల్లో ఎలాంటి అమ్మాయి ఎదురైయింది ? ఎలా ఎదుర్కున్నాడు ? మధ్యతరగతి కుర్రాడు సిటీ నేపధ్యం వున్న అమ్మాయి ప్రేమలో పడితే ఎలా వుంటుంది ? అనే అంశాలు సరదాగా ఉంటాయి. శేఖర్ చంద్ర మంచి ఆల్బం ఇచ్చారు.

హీరోయిన్ కోసం ఐదు నెలలు

ఒక అమ్మాయి తాలూకు ఎమోషన్స్ అన్నీ వుంటాయి. ఒక మధ్యతరగతి తండ్రి కొడుకు, తల్లి, కొడుకు మధ్య అనుబంధం ఎమోషనల్ గా వుంటుంది. అద్భుతమైన క్లైమాక్స్ వుంటుంది. అందరూ కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది. ఇది మనోడి కథరా అనే ఫీలింగ్ వునప్పుడే నేను ఎక్కువ ఎగ్జైట్ అవుతాను. సమ్మతమే టైటిల్ విన్నప్పుడే చాలా ఎగ్జైట్ ఫీలయ్యాం. హీరోయిన్ ని ఎంపికకు ఐదు నెలల సమయం పట్టింది. చాలా రిజక్షన్స్ కూడా అయ్యాయి. తెలుగమ్మాయి చాందినీ అయితే జోడి బావుంటుందని దర్శకుడు గోపి ఫైనల్ చేశారు. చాందినీ నాలానే కొంచెం హైపర్ యాక్టివ్ గా వుండటం.. ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉండటంతో మామధ్య సన్నివేశాలు బాగా వచ్చాయి. చాలా సహజంగా వచ్చాయి. ఇద్దరం షార్ట్ ఫిలింస్ నుంచే రావడంతో కంఫర్ట్ జోన్ వుంది. ఆ ఫ్రెష్ నెస్ స్క్రీన్ పై చూస్తారు.

నాలుగు సినిమాలు చేస్తున్నా..

చూడటానికి ‘సమ్మతమే’ సాఫ్ట్ గా కనిపించినా.. మాస్ టీజింగ్ వుంటుంది. సినిమా లో బిగ్ క్యాస్టింగ్ ఉంది. సప్తగిరి గారి ఎపిసోడ్ బావుంటుంది. లిమిటెడ్ బడ్జెట్ అనుకున్నా పెద్ద సినిమా అయ్యింది. సినిమాలో రిచ్ నెస్ కనిపిస్తుంది. హీరోలు ఎక్కువ సినిమాలు చేయడమే కరెక్ట్ అనేది నా అభిప్రాయం. వరుసగా సినిమాలు చేస్తుంటే అందరికీ పని దొరుకుతుంది. వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నా వాటికి కేటాయించే సమయం ఎక్కువ. నా దర్శకులు, నిర్మాతలు బలంగా వుండటం నా అదృష్టం. రాబోయే నా నాలుగు సినిమాలు పెద్ద స్కేల్లో చేశాం. ఆగస్ట్ లో ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సెప్టెంబర్ చివరిలో ‘వినరో భాగ్యం విష్ణు కథ’ గీత ఆర్ట్స్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సినిమా వుంటుంది. ఈ ఏడాదిలోనే ఈ మూడు సినిమాలు విడుదలవుతాయి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...