Switch to English

మూడున్నరేళ్ళ ముచ్చట.! దేశం కోసం ప్రాణాలర్పించేదెలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఐదేళ్ళకోసారి మారే ప్రభుత్వం.! అప్పుడు మీరేం చేశారు.? అంటూ నిస్సిగ్గుగా నిలదీసే రాజకీయం.! తాము అధికారంలో వున్నప్పుడు అప్పలు చేసి రాష్ట్రాల్నీ, దేశాల్ని ముంచే రాజకీయ పార్టీలు రాజ్యమేలుతున్న రాజకీయం ఇది.!

కానీ, దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధమయ్యే యువతకి, కేవలం మూడున్నరేళ్ళ మాత్రమే కొలువు. ఇదెక్కడి పంచాయితీ.? అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.? ఆరు నెలల శిక్షణ, మూడున్నరేళ్ళ కొలువు.. ఆ తర్వాత రిటైర్మెంట్. చేతిలో ఇంటర్మీడియట్ సమానమైన పత్రమట.!

అగ్నిపథ్ స్కీమ్ తాలూకు ప్రత్యేకత ఇదంతా. అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఇలా వుంటుందా.? అంటే, చాలా దేశాల్లో ఈ ట్రెండ్ వుందని, సైన్యాన్ని ఆధునీకరించే క్రమంలోనే ఇదంతా చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. డ్రోన్లు వాడుతున్నాం, అత్యాధునిక యుద్ధ విమానాలు వాడుతున్నాం.. సో, రక్షణ సిబ్బంది సంఖ్యాపరంగా ఎక్కువ అనవసరం. ఖర్చు దండగ వ్యవహారమది.. అన్నట్టుగా వుంది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తీరు.

శాశ్వత ఉద్యోగానికీ, తాత్కాలిక ఉద్యోగానికీ చాలా తేడా వుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ని తీసుకుంటే, శాశ్వత ఉద్యోగి.. ఆ సంస్థ తనదని భావిస్తాడు. అదే తాత్కాలిక డ్రైవర్ అయితే, సంస్థ ఏమైపోతే తనకేంటి.? అనుకుంటాడు. అదీ తేడా.

బస్సుల విషయంలోనే పరిస్థితి ఇలా వుంటే.. దేశానికి భద్రత కల్పించే సైనికుడు, తాత్కాలిక ఉద్యోగం చేయాల్సి వస్తే, పరిస్థితులు ఎలా వుంటాయో ఊహించుకోవడం కష్టం. ఇది సైన్యాన్ని అవమానించడం ఎంతమాత్రమూ కాదు. ఆ సైన్యాన్ని దేశంలో ఎవరూ అవమానించరు.. రాజకీయ నాయకులు తప్ప.

ఖర్చు దండగ వ్యవహారమేంటి.? దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైనికుడికి వెల కట్టగలరా ఎవరైనా.? రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక, తమ వారికి సలహాదారుల పదవులు ఇచ్చుకుని, దున్నపోతుల్లా వాళ్ళని మేపితే అది వృధా ఖర్చు కాదట.! ప్రభుత్వంలో వున్నవారు తమ ఆర్భాటలకు ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తే అది వృధా ఖర్చు కాదట. సొంత ప్రచారం కోసం చేసే ఖర్చూ వృధా ఖర్చు కాదట.

కానీ, దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైనికుడికి చేసేది మాత్రం వృధా ఖర్చు అట. దేశం ఎటు పోతోంది.? ఈ ‘అగ్ని’ పరీక్ష దేశానికి అవసరమా.?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...