Switch to English

వైసీపీలో అంతర్గత వర్గపోరు: పతనం మొదలైనట్లేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఉత్తరాంధ్ర వైసీపీలో కలకలం.. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి మూడినట్లే.. రాయలసీమ వైసీపీలో ప్రకంపనలో.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ, నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాల్లోనూ వైసీపీ ప్రజా ప్రతినిథులపై పార్టీ క్యాడర్‌లో పెరుగుతున్న అసహనం.. ఇలా మీడియాలో నిత్యం వార్తలు గుప్పుమంటున్నాయి.

అధికారంలో వున్న పార్టీపై ఇలాంటి కథనాలు సర్వసాధారణమే. గోరంతలు కొండంతలుగా చూబడటం అనేది మీడియాలో ఇటీవలి కాలంలో అలవాటైన వ్యవహారంగా మారింది. పైగా, తెలుగు మీడియాలో చాలావరకు పార్టీల వారీగా విడిపోయిన దరిమిలా, ఈ తరహా ప్రచారంలో వింతేమీ లేదు.

కానీ, కింది స్థాయి పరిస్థితులు కూడా అలాగే వుంటే.? అది అదికార పార్టీకి కనిపించకపోతే.? ‘జగన్ ముద్దు.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వద్దు..’ అని వైసీపీ జెండాలు పట్టుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలే ఆందోళనలు చేస్తే.? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇది.

పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల కలత చెందుతూ ఓ కింది స్థాయి నేత ఓ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేస్తే, ‘మాఫియా’ తరహాలో, ఆ వైసీపీ నేత మీద సాటి వైసీపీ నేతలు దాడి చేసిన వైనం.. ఇటీవల చూశాం. సాధారణంగా బాధితుడి మీద కేసులు పెట్టే పోలీసులు, ఈసారెందుకో బాధ్యులపై కేసు పెట్టి ‘మమ’ అనిపించేశారు.

ఓ మంత్రిగారి మీదనే ఈ వ్యవహారంలో ఆరోపణలు రావడం, వీడియో లీక్ అవడంతో.. విషయాన్ని అలా పక్కదారి పట్టించారన్న వాదనలూ లేకపోలేదు. రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు, కింది స్థాయి నేతలు తమ ప్రజా ప్రతినిథులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే పరిస్థితి రావడం ఆశ్చర్యకరమే.

‘ఇది వైసీపీ పతనానికి నాంది..’ అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ‘అబ్బే, అదంతా ఉత్తదే. కొందరు పెయిడ్ ఆర్టిస్టులు చేసే ఆందోళనల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.’ అంటూ తమకు అలవాటైన భాషలో బుకాయిస్తున్నారు కొందరు వైసీపీ నేతలు. ‘చెద’ పట్టేసింది.. పైకి కాస్త తక్కువే కనిపిస్తోంది ఆ ఇంపాక్ట్. తేరుకోకపోతే, పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టిపోవడం, ప్రభుత్వం గల్లంతవడం ఖాయమే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...