Switch to English

పెంచిన కేసీయార్ గొప్పడా.? తగ్గించిన వైఎస్ జగన్ గొప్పోడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారం.. మిగతా అన్ని సమస్యల కంటే చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి కొందరికి. పెట్రో ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే వున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల సంగతి సరే సరి. అయినా, వాటి గురించి పెద్దగా ఎవరూ చర్చించుకోవడంలేదు. ఎందుకంటే, అవసలు వారికి సమస్యలుగానే కనిపించడంలేదు.

మొన్నామధ్య లిక్కర్ ధరల విషయంలోనూ ఇలాగే రచ్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్య నియంత్రణ పేరుతో, మందుబాబులకి షాకిచ్చేలా మద్యం ధరల్ని పెంచేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి మద్యం బాటిళ్ళు వెళ్ళకుండా కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారు. అయినా, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్ళడం ఆగలేదు.

సరిహద్దులు దాటి, పొరుగు రాష్ట్రాలకు వెల్లి పూటుగా మద్యం తాగి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళడం ఓ అలవాటుగా పెట్టేసుకున్నారు చాలామంది అప్పట్లో. ఇక ఇలా కాదనుకుని, మద్యం ధరల్ని కొంతమేర వైఎస్ జగన్ ప్రభుత్వం తగ్గించక తప్పలేదు. సంక్షేమ పథకాల తాలూకు ఫలాల్ని నాశనం చేస్తున్నది మద్యపానమేనని అందరికీ తెలుసు. కానీ, ఆ మద్యపానం మీద వచ్చే ఆదాయం ప్రభుత్వాలకు భలే ఇంపుగా వుంటుంది గనుక, లిక్కర్ విషయంలో.. ‘నియంత్రణ, నిషేధం’ అన్నవి వట్టిమాటలే.

ఇక, పండగల వేళ ప్రత్యేక బస్సుల పేరుతో ఆర్టీసీ దోపిడీ గురించి కొత్తగా చెప్పేదేముంది.? తెలంగాణ ఆర్టీసీ ఈ మధ్య ఈ తరహా బాదుడు నుంచి కాస్త ఉపశమనం కలిగించింది ప్రయాణీకులకి. ఏపీ ప్రభుత్వం మాత్రం 50 శాతం అదనపు బాదుడుతో పండక్కి వెళ్ళేవారికి చుక్కలు చూపించేస్తోంది.

సినిమా అనేది వినోదానికి సంబంధించి ఓ ఆప్షన్ మాత్రమే. అందరూ సినిమాల్ని థియేటర్లలోనే చూడాలనుకుంటారనేది వట్టిమాట. సినిమా థియేటర్లు ప్రేక్షకులకు అందడంలేదు. టిక్కెట్ల ధరలు తగ్గించినమంత్రాన థియేటర్లకు జనం పోటెత్తేయరు టిక్కెట్ల ధరలు పెరిగితే మాత్రం, థియేటర్లకు జనం వెళ్ళడం కాస్త తగ్గొచ్చు.

టిక్కెట్ల రేట్లు తగ్గించారు కాబట్ట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గొప్పోడని, రేటు పెంచారు గనుక కేసీయార్ చెడ్డోడనీ.. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అర్థం పర్థం లేని వ్యవహారం. ఒకప్పుడు రూపాయి మేర పెట్రోల్ ధర మూడు నెలలకో ఆరు నెలలకో పెరిగితే, ప్రజా ఉద్యమాలు నడిచేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి వుందా.?

సినిమా టిక్కెట్ల గురించి చర్చించుకుంటున్నట్లుగా, కీలక ప్రజా సమస్యల గురించి ప్రజలే చర్చించుకోవట్లేదు. సో, ఇక్కడ అధికారంలో వున్నోళ్ళను తప్పుపట్టాల్సిన పనిలేదమో.. వారెలాంటి పాలన అందించినాసరే.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....