Switch to English

లోక్‌సభ సాక్షిగా వైసీపీకి ఝలక్ ఇస్తున్న రఘురామ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

పార్లమెంటు సమావేశాల్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఓ రేంజ్‌లో సద్వినియోగం చేసుకుంటున్నారు.. సొంత పార్టీని ఇరకాటంలో పెట్టే విషయమై. రఘురామ ఏ విషయమ్మీద మాట్లాడినా, దానికి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ ఎంపీలు నానా తంటాలూ పడాల్సి వస్తోంది. మొన్న రాజమండ్రి ఎంపీ భరత్, తాజాగా మరో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి.. రఘురామ వ్యూహంలో చిక్కారు.. పార్టీని అభాసుపాల్జేసుకున్నారు లోక్ సభ సాక్షిగా.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, రాష్ట్రం చేస్తున్న అప్పులపై కేంద్రం సీరియస్‌గా ఆలోచన చేయాలని రఘురామ నినదిస్తే, రఘురామపై సీబీఐ కేసులున్నాయనీ, బ్యాంకుల్ని ముంచేశారని వైసీపీ ఎంపీ భరత్ మార్గాని తదితరులు అడ్డగోలు వాదనను తెరపైకి తెచ్చారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం వుందంటూ ఎంపీ భరత్ నోరు జారేశారు. దాంతో పెద్ద దుమారమే చెలరేగింది.

‘వ్యక్తిగత ఆరోపణలు వద్దు..’ అంటూ పదే పదే వైసీపీ ఎంపీలకే లోక్ సభ స్పీకర్ ఝలక్ ఇస్తూ వస్తున్న విషయం విదితమే. దాంతో, రఘురామలో కొత్త జోరు కనిపిస్తోంది. తాజాగా, అమరావతి రైతుల పాదయాత్రకు వైఎస్ జగన్ సర్కార్ సృష్టిస్తున్న అడ్డంకులపై లోక్ సభలో రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకేముంది, మరోమారు రఘురామ మీద వ్యక్తిగత ఆరోపణలు చేశారు వైసీపీ ఎంపీలు. మళ్ళీ పాత విమర్శే.. రఘురామ మీద సీబీఐ కేసులున్నాయన్నది వైసీపీ ఆరోపణ. దానికి రఘురామ కూడా బాగానే రివర్స్ ఎటాక్ చేశారు. ‘మీ ముఖ్యమంత్రి మీద వంద కేసులున్నాయ్..’ అంటూ రఘురామ విరుచుకుపడ్డారు.

పార్లమెంటు సాక్షిగా అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యలు ప్రత్యేక హోదా కోసమో, రాష్ట్రానికి సంబంధించిన మరో కీలక అంశం కోసమో నినదిస్తే బావుంటుందిగానీ.. ఒకరి మీద ఒకరు దుమ్మత్తి పోసుకోవడం.. అందునా ఒకే పార్టీకి చెందిన ఎంపీలు ఇలా రచ్చకెక్కడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

వైసీపీ ఎంపీలకు విషయం అర్థమవుతోందో లేదోగానీ.. వాళ్ళ పరువు పోతోంది.. రాష్ట్రం పరువు కూడా పోతోంది పార్లమెంటు సాక్షిగా.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...