Switch to English

‘మా’ మెడికల్ రాయితీ: ఇక్కడా చిరంజీవిపై పోటీయేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి.. ఆ పేరంటేనే ఓ ప్రభంజనం. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు.. అన్న గౌరవం ఆయన్ని కొన్నాళ్ళ క్రితం వరించింది. ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిందా గౌరవం. కరోనా నేపథ్యంలో చిరంజీవి ముందుండి, సినీ పరిశ్రమలో కరోనా పాండమిక్ కారణంగా ఇబ్బందులెదుర్కొంటున్నవారికి సాయమందించారు. చిరంజీవితో పలువురు సినీ ప్రముఖులు చేతులు కలిపారు.. సినీ పరిశ్రమలోని కార్మికుల్ని ఆదుకునేందుకు.

నిజానికి, చిరంజీవి ఎప్పుడూ పరిశ్రమలో అందరికీ అందుబాటులోనే వుంటారు. చిన్న సినిమాల్ని ప్రమోట్ చేసేందుకు తనవంతు సాయం చేయడంలోగానీ, పరిశ్రమ సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడంలోగానీ.. చిరంజీవి ఎప్పుడూ చొరవ చూపుతూనే వుంటారు. కానీ, అది కొందరికి నచ్చడంలేదు. అలా నచ్చకపోవడం వల్లే, చిరంజీవికి వున్న ‘పెద్దన్న’ గౌరవాన్ని తగ్గించేందుకు తెరవెనుక ‘కుట్రలు’ చాలానే జరిగాయి, జరుగుతూనే వున్నాయి.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి పేరుని బయటకు లాగి బదనాం చేయడానికి ఎన్ని కుట్రలు నడిచాయో అందరూ చూశారు. ‘చిరంజీవికి ఏంటి సంబంధం.?’ అని మొత్తం సినీ పరిశ్రమ అభిప్రాయపడినా, ‘చిరంజీవి జోక్యం చేసుకున్నారు, ఓటమి చవిచూశారు..’ అంటూ దుష్ప్రచారం చేశారు, చేస్తూనే వున్నారు.

అయినా, చిరంజీవి పరిశ్రమకు చేయాలనుకున్న సేవ చేయడంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. తాజాగా ఓ ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ప్రారంభిస్తూ, ఆ వేదికపై నుంచి సినీ కార్మికులకు 50 శాతం రాయితీ కావాలని కోరారు.. వైద్య పరీక్షలకు సంబంధించి. ఆ సంస్థ, చిరంజీవి విన్నపాన్ని మన్నించింది. అంతే కాదు, చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకి విరాళం కూడా అందించింది.

ఇది గిట్టని ఇంకో వర్గం, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున సభ్యులకు రాయితీతో కూడిన వైద్య పరీక్షలంటూ పబ్లిసిటీ స్టంట్లు షురూ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చిరంజీవి ప్రయత్నాల్ని అభినందించాల్సిన సోకాల్డ్ సినీ ప్రముఖులు, ఇంకా చిరంజీవికి వ్యతిరేకంగా కుట్రలు చేయడమేంటి.? అంటూ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.

సినిమా టిక్కెట్ల వ్యవహారంపై చిరంజీవి స్పందించారు. పరిశ్రమ పట్ల చిత్తశుద్ధి వుంటే, సోకాల్డ్ సినీ ‘పెద్దలు’, ఈ వ్యవహారంపై బహిరంగంగా స్పందించగలరా.? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలతో తమకున్న పరిచయాల్ని ఉపయోగించి, పరిశ్రమకు తీపి కబురు తీసుకురాగలరా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....