Switch to English

‘అడుక్కు తింటున్నారు’ అంటే అంత ఉలిక్కిపడ్డారెందుకు చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ప్రతి నెలా కొత్త అప్పు చేస్తే తప్ప రాష్ట్రం మనుగడ సాధించలేని దుస్థితికి చేరింది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో ఇదే వాస్తవం. ‘మేం రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాం..’ అని అధికార వైసీపీ ప్రచారం చేసుకుంటోందిగానీ, రాష్ట్రాన్ని పాలకులు అప్పుల్లో ముంచేస్తున్నారన్నది కఠోరమైన వాస్తవం.

దేశంలో ఏ రాష్ట్ర ఆర్థిక మంత్రీ పడనన్ని పాట్లు పడుతున్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కొత్త అప్పులు ఎప్పటికప్పుడు అవసరమవడంతో, ఆ అప్పుల కోసం కేంద్రం నుంచి అనుమతి పొందేందుకు పదే పదే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అవ్వాల్సి వస్తోంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి, ‘అడుక్కు తినడమే’. ఇదే మాట తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి అనడంతో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ నేతలకు ఒళ్ళు మండిపోయింది. ‘మేం రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించే కేంద్రాన్ని అడుక్కుంటున్నాం.. మీరు, ఢిల్లీకి వెళ్ళి ఏం బిచ్చమడుగుతున్నారు.?’ అంటూ ఏపీ మంత్రి పేర్ని నాని సెటైర్ వేశారు తెలంగాణ మంత్రి మీద.

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తెలంగాణ మంత్రిపై గుస్సా అయ్యారు. తెలంగాణ మంత్రికి, ఆంధ్రప్రదేశ్ గురించి వెటకారం చేయాల్సిన అవసరం లేదు. నిజమే, ఆయన మాట్లాడిన మాటలు సమర్థనీయం కాదు. ఏ రాష్ట్ర అవసరాలు ఆ రాష్ట్రానివి. విభజన కారణంగానే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఆ నష్టానికి కారణం, ముమ్మాటికీ విభజనవాదులే.

కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తోంది.? గతంలో చంద్రబాబు పాలన, ఇప్పుడు వైఎస్ జగన్ పాలన.. రెండూ కలిసి రాష్ట్రాన్ని మరింతగా అప్పుల్లో ముంచేస్తున్నాయి. ప్రతి నెలా కొత్త అప్పులు.. అప్పుల మీద అప్పులు.. వెరసి, గుక్క తిప్పుకోలేని పరిస్థితి. వినడానికి కొంచెం బాధాకరంగానే తెలంగాణ నేతల మాటలున్నా, ఆంధ్రప్రదేశ్ దుస్థితి కూడా అలాగే వుంది.

అబ్బే, అస్సలు తాము అప్పులు అడుక్కోవట్లేదని చెప్పే ధైర్యం ఆంధ్రప్రదేశ్ పాలకులకు వుందా.? అప్పు చేసి సంక్షేమ కూడు.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అయినా, రాష్ట్రం నాశనమైపోతోందిక్కడ.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...