ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన విద్యార్థిని సుగాలి ప్రీతిపై హత్యాచారం ఘటనకు సంబంధించి ‘పూర్తి న్యాయం’ జరిగిపోయిందట బాధిత కుటుంబానికి. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి 5 సెంట్ల నివాస స్థలం అలాగే, 5 ఎకరాల పొలం అందించేసింది. నిజానికి, మంచి విషయమే ఇది. అయితే, బాధిత కుటుంబానికి ఇది కేవలం ఓ ఆసరా మాత్రమే. దీన్ని పూర్తి న్యాయం.. అనగలమా.?
అసలు న్యాయం అంటే ఏమిటి.? బాధిత కుటుంబానికి న్యాయం ఎలా జరుగుతుంది.? ఇంకెలా జరుగుతుంది.. దోషులకు శిక్ష పడినప్పుడు మాత్రమే, దాన్ని సంపూర్ణ న్యాయం జరిగినట్లు భావించాల్సి వుంటుంది. చంద్రబాబు హయాంలో సుగాలి ప్రీతి హత్యాచారానికి గురైంది. అప్పటినుంచి ఇప్పటిదాకా, ఈ కేసులో దోషులెవరో తేలలేదు.
చంద్రబాబు హయాంలోనూ విచారణ అడ్డగోలుగా జరిగిందన్న ఆరోపణలున్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కూడా అదే పరిస్థితి. జనసేన పార్టీ, సుగాలి ప్రీతి కుటుంబానికి బాసటగా నిలిచి, సీబీఐ విచారణకు డిమాండ్ చేయడంతో, మొదట తటపటాయించిన జగన్ సర్కార్, చివరికి సీబీఐకి ఆ కేసు విచారణను అప్పగించేందుకు సముఖత వ్యక్తం చేసింది.
‘సీబీఐకి అప్పగించేశాం.. మా పనైపోయింది..’ అని చేతులు దులిపేసుకుంది వైఎస్ జగన్ సర్కార్. వాస్తవానికి, విచారణను సీబీఐకి అప్పగించేశామని చెబుతున్న జగన్ సర్కార్, ఆ కేసు ఫాలో అప్ వ్యవహారాల గురించి అస్సలేమాత్రం పట్టించుకుంటున్నట్టు లేదు.
బాధిత కుటుంబం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిందంటూ అధికార పార్టీ అనుకూల మీడియా, అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం షరామామూలు వ్యవహారమే. రాష్ట్రంలో రాజకీయం ఎలా వెర్రి తలలు వేస్తోందో, ప్రభుత్వమెలా పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
‘దిశ’ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్న పాలకులు, సుగాలి ప్రీతి కేసులో దోషులెందుకు ఇంతవరకు తప్పించుకు తిరుగుతున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలరా.? ‘సాయం’ మంచిదే, దాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ, న్యాయం జరిగేదెలా.? న్యాయమెలాగూ జరగదు గనుక, సాయానికి ‘పూర్తి న్యాయం’ అని కొత్త పేరు పెట్టేశారన్నమాట.
328957 959845Perfectly composed content , thankyou for entropy. 608136
955970 619291If running proves to be a difficulty then it may possibly be wise to discover alternative exercises such as circuit training, weight training, swimming or cycling. 439559
450297 326229dude this just inspired a post of my own, thanks 342342
489824 200585Really man or woman speeches need to seat giving observe into couples. Brand new sound system just before unnecessary folks need to always be mindful of typically senior common rule from public speaking, which is to be the mini. greatest man speaches 852068