Switch to English

26 క్యాపిటల్స్.! యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రశ్న సంధిస్తే, అటు వైపు నుంచి సమాధానం దొరకడం కష్టం.! ఎందుకంటే, అటువైపు వున్నది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. సూటిగా, సుత్తి లేకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నాస్త్రం సంధిస్తారు. సమాధానం చెప్పడానికి వైసీపీ నేతల దగ్గర సబ్జెక్ట్ వుండదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తారు.. ప్యాకేజీ అంటారు.. దత్త పుత్రుడంటారు. అంతకు మించి వైసీపీ నేతలకు ‘తెలివి’ వుంటుందని ఎలా ఆశించగలం.? అయినాసరే, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూనే వుంటారు. అట్నుంచి సమాధానం చెప్పే సత్తా ఎవరికీ లేదని తెలిసినా, జనసేన అధినేత ప్రశ్నలు ఎందుకు వేస్తారంటే, ప్రజలు ఆలోచించాలని మాత్రమే. వ్యవస్థలో మార్పు రావాలంటే, అది ప్రజల వల్లనే సాధ్యమవుతుంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి లక్ష్యం.!

తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అని ప్రస్తావించారు. రాజధానితోనే ఓ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనుకుంటే, రాష్ట్రంలో ప్రతి జిల్లా కూడా అభివృద్ధి చెందాలి. ఆ లెక్కన, మూడు రాజధానులేం సరిపోతాయ్.? జిల్లాకి ఒక రాజధాని చెప్పున.. మొత్తం 26 రాజధానులు పెట్టండి.. 26 రాష్ట్రాలు చేసెయ్యండి.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనండి.. అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్, అధికార వైసీపీని ప్రశ్నించారు. మూడు ప్రాంతాలు, మూడు రాజధానులన్నప్పుడు.. 25 జిల్లాలు, 25 రాజధానులు సబబే కదా.! రాజధాని అమరావతి వల్ల 29 గ్రామాలే బాగుపడతాయనీ, ఓ సామాజిక వర్గమే బాగుపడుతుందని వైసీపీ చెబుతోంది. అదే నిజమైతే, శాసన రాజధాని అక్కడే ఎందుకు.? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయంలోనూ అదే జరుగుతుంది కదా.? జ్యుడీషియల్ క్యాపిటల్ విషయంలోనూ అంతకు మించి ఏం జరుగుతుంది.?

అయినా, ఎన్నాళ్ళని రాజధాని లేదా రాజధానుల పేరుతో రాష్ట్రంలో అరాచక రాజకీయం రాజ్యమేలుతుందన్న చర్చ ప్రజల్లో జరగాలి. రాష్ట్రానికి రాజధాని అవసరం. ఆ రాజధాని లేకుండా రాష్ట్రాన్ని వైసీపీ పాలిస్తోందన్న విషయాన్ని ప్రజలే గుర్తెరగాలి. రాష్ట్రానికి రాజధాని అవసరమా.? లేదా.? అన్న దిశగా ప్రజలూ ఆలోచన చేయాలి. అసలెందుకు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నదానిపై జన బాహుళ్యంలో చర్చ జిగితే, సమాధానం ఖచ్చితంగా బయటకు వస్తుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...