రాష్ట్ర మంత్రి వర్గంలో రెండు పోస్టులు ఖాళీ కాబోతున్నాయి. ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళుతున్న దరిమిలా, వారి స్థానంలో మరో ఇద్దరు కొత్తవారికి అవకాశం కలుగుతుంది. ఆ ఇద్దరు కొత్తవారెవరు.? అన్నదానిపై వైసీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో పదవుల పంపకానికి సంబంధించి ‘సమీకరణాలు’ చాలా క్లియర్గా వుంటాయి. ఆ లెక్కన, ఈ రెండు కొత్త పదవుల్లో, సామాజిక వర్గాల బ్యాలెన్సింగ్ తప్పనిసరయ్యేలా వుంది.
మరోపక్క, మంత్రి పదవి కోసం ఎదురుచూస్తోన్న రోజా, ఈసారి తనకు ఎలాగైనా పదవి వస్తుందనే ఆశతో వున్నారట. నిజానికి, ఫైర్ బ్రాండ్ రోజా.. తనకు అందరికన్నా ముందే మంత్రి పదవిని వైఎస్ జగన్ ఇస్తారని భావించారు. కానీ, అలా జరగలేదు. రెండున్నరేళ్ళలో మంత్రి వర్గంలో మార్పులుంటాయని సంకేతాలు ముందే పంపడం ద్వారా, పార్టీలో అసంతృప్తి సెగల్ని కొంతమేర తగ్గించగలిగారు వైఎస్ జగన్. అలా రోజా కూడా సర్దుకుపోవాల్సి వచ్చింది.
రెండున్నరేళ్ళ తర్వాత కాదు, ఇప్పుడే తనకు పదవి వస్తుందని రోజా తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారంటూ.. రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, రోజాకి మంత్రి పదవి ఇవ్వాలంటే, సామాజిక వర్గ సమీకరణాలు బ్యాలెన్స్ అవ్వాలి. అలా జరగాలంటే, ఆమె సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రిపై వేటు వేయాల్సి వుంటుంది. కానీ, అది జరిగే పనేనా.? అన్నది ఇంకో చర్చ.
ఇప్పటికే ‘రెడ్డి’ సామాజిక వర్గానికి ‘పెద్ద పీట’ అనే విమర్శల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అన్ని లెక్కలూ వేసుకునే, ఆ రెండు మంత్రి పదవులతోపాటు మరికొన్ని మార్పులు చేర్పులకూ వైఎస్ జగన్ ఆస్కారమివ్వబోతున్నారని తెలుస్తోంది. ‘ఇప్పుడు కాకపోతే, ఇంకో ఏడాది తర్వాతైనా రోజాకి వైఎస్ జగన్ మంత్రి వర్గంలో కీలక పదవి దక్కనుంది. ఆమె సేవల్ని పార్టీ విస్మరించదు. పైగా, వైఎస్ జగన్ ఆమె పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమెకు ఏపీఐఐసీ ఛైర్పర్సన్గా అవకాశమిచ్చారు..’ అంటూ వైసీపీ నేతలు కొందరు చెబుతున్నారు.
అత్యంత విశ్వసనీయ వర్గాల ప్రకారం, మంత్రి పదవి సంగతెలా వునా, వైసీపీ ఎమ్మెల్యే రోజా.. ముఖ్యమంత్రి నుంచి మరో తీపి కబురుని త్వరలో అందుకోబోతున్నారంటూ వైసీపీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన గాసిప్ ప్రచారంలో వుంది. అదేంటన్నది కొద్ది రోజుల్లోనే తెలియబోతోందట.
333335 582913yourselfm as burning with excitement along accumulative concentrating. alter ego was rather apocalyptic by the mated ethical self went up to. Its punk up to closed ego dispirited. All respecting those topics are movables her should discover no finish touching unpronounced. Thanks so significantly! 296188
357160 833140I found your weblog internet site on google and check a couple of of your early posts. Proceed to maintain up the really very good operate. I just extra up your RSS feed to my MSN News Reader. Looking for ahead to reading extra from you later on! 209323
131558 38989Good read, I just passed this onto a colleague who was doing some research on that. And he actually bought me lunch as I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 348623
671568 791078Extremely interesting topic , thanks for putting up. 57058
43627 405373You could discover two to three new levels inside L . a . Weight loss and any 1 someone is extremely critical. Initial stage may be real melting away rrn the body. shed weight 634340