ఎంతగా ఓ వ్యక్తి మీద పగ పెంచుకుంటే, ఇలాంటి నీఛ నికృష్టమైన రాతలు రాయగలరు.? ఔను, అది బులుగు పైత్యం.. అక్కుపక్కి అరాచక రాతల దాష్టీకం. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రదర్శించారంటూ న్యాయస్థానం ముందు వాపోయారు. న్యాయస్థానం ఆయన ఆవేదనను అర్థం చేసుకుని, వైద్య పరీక్షలకు ఆదేశించింది. వైద్య పరీక్షల్లో ఏం తేలుతుందన్న విషయాన్ని పక్కన పెడితే, ‘అక్క పక్షి’ అప్పుడే చెత్త రాతలు తెరపైకి తెచ్చింది.
రఘురామ కాళ్ళపై గాయాలు పోలీసులు కొట్టిన దెబ్బల వల్ల సంభవించినవి కాదనీ, అది సోరియాసిస్ కారణంగా వచ్చినవి అయి వుండొచ్చనీ అక్కుపక్షి పేర్కొంది. ఎంత బులుగు మీడియా అయితే మాత్రం.? మరీ ఇంత పైత్యమా.? ఇంత అరాచకమా.? నరనరానా రఘురామపై ద్వేషం నింపుకుంటేనే ఇంత చెత్త రాత రాయగలెవరైనా.
రఘురామరాజుకి సంబంధించిన ఫొటోల్లో ఓ కాలికి బలమైన తీగని కట్టి హింసించినట్లుగా కనిపిస్తోంది.. ఇవి కోర్టు ముందుంచిన సాక్ష్యాలే గనుక, ఊరికే అవేవో కల్పితం అనడానికి వీల్లేదు. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు.. అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతాయి. నిజాలేంటన్నది ఆయా నివేదికల్లో తేలొచ్చు. ఈలోగా తొందరపడి, ఓ వ్యక్తికి తగిలిన గాయాల్ని.. సోరియాసిస్.. అనడం ఎంతవరకు సబబు.?
ఓ పార్లమెంటు సభ్యుడికి ఇంతటి అవమానం జరుగుతోంటే.. కీలకమైన వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. అరెస్టు చేసిన వ్యక్తిపై పోలీసులు దాడి చేయడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది కొత్త విషయమేమీ కాదు. అయితే, ఓ ప్రజా ప్రతినిథిపై ఇలా వ్యవహరించడం అనేది ఇటీవలి కాలంలో చాలా చాలా అరుదైన విషయం.
కొట్టారా.? లేదా.? అన్నది నిర్ణయించాల్సింది న్యాయస్థానమే గనుక.. ఆ విషయంపై ఇప్పుడే ఎలాంటి తీర్మానం ఎవరూ చేసేయడం సబబు కాదు. కానీ, అక్కు పక్షి రాతలేంటి.? జర్నలిజం ముసుగులో రాజకీయ వ్యభిచారం చేసేవాళ్ళని ఏమనాలి.?
335688 90728An attention-grabbing dialogue is value comment. Im certain that its far better to write on this topic, towards the often be a taboo topic but typically persons are not sufficient to speak on such topics. To one more location. Cheers 669536
818891 983142Sweet internet site , super style , truly clean and utilize genial . 536811