YS Sharmila: ‘జగనన్న వదిలిన బాణాన్ని నేను..’ ఒకప్పుడు తన వాగ్భాణాలతో అదరగొట్టిన షర్మిల (YS Sharmila) ఇప్పుడు అదే బాణమై జగన్ వైపే దూసుకొస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపేట్టిన మరుక్షణమే జగన్ (CM YS Jagan)పై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇందుకు జగన్ .. ప్రతిపక్షాలు తన కుటుంబాన్ని చీలుస్తున్నాయంటూ షర్మిలపై పరోక్ష విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా కాకినాడలో జరిగిన పార్టీ సమావేశంలో జగన్ తీరుపై విరుచుకుపడ్డారు షర్మిల.
‘ఈరోజు వైఎస్సార్ కుటుంబం చీలిపోయిందంటే జగన్ ఆన్నగారు చేతులారా చేసుకున్నదే. కాంగ్రెస్ పై పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఏపి అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉండటానికి చంద్రబాబు, జగన్ఆన్నగారే కారణం. దీనికి సాక్ష్యం దేవుడు, తల్లి విజయమ్మ, నా కుటుంబం’.
‘వైసీపీ కోసం పాదయాత్ర చేయమన్నారు. సమైక్యాంధ్ర యాత్ర చేశా. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేశా. ఇంటిని, పిల్లలకు పక్కనపెట్టి ఎండనక, వానననక రోడ్ల మీదనే ఉన్నా. ఎప్పుడు అడిగితే అప్పుడు మారు మాట్లాడకుండా అండగా నిలబడ్డా. స్వలాభం చూడకుండా నిస్వార్థంగా పని చేశా. 2019లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగా. మిమ్మల్ని గెలిపించా’.
‘జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వేరే మనిషి. పూర్తిగా మారిపోయాడు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా బాధపడలేదు. ముఖ్యమంత్రి అయితే చాలు.. వైఎస్సార్ పేరు, ఆశయాలు నిలబెడితే చాలనుకున్నా. కానీ.. ఈ 5ఏళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీ కి బానిసలయ్యార’ని ధ్వజమెత్తారు.
100larn.com เว็บหวยส้มที่มาแรงที่สุด
อัตราจ่ายสูงสุด | หวย 12 ราศี บาทละ 1,200 AF12% |