Switch to English

ఎన్‌పిఆర్‌పై వైఎస్‌ జగన్‌ రివర్స్‌ గేర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌) విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రివర్స్‌ గేర్‌ వేసేశారు. గతంలో ఎన్‌పిఆర్‌కి మద్దతుగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందడుగు వేసిన విషయం విదితమే. కానీ, ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికపై ఎన్‌పిఆర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఓ ట్వీటేశారు వైఎస్‌ జగన్‌. అంతే కాదు, ఎన్‌పిఆర్‌పై అసెంబ్లీలో చర్చించి తీర్మానం కూడా చేస్తామని ఆ ట్వీట్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొనడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌.. ఈ మూడూ ఒకదానితో ఒకటి లింక్‌ వున్న వ్యవహారాలేనంటూ గత కొంతకాలంగా నానా యాగీ జరుగుతోంది. ఈ మేరకు ఢిల్లీ సహా దేశంలోని పలు నగరాల్లో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో అయితే సీఏఏ సెగల కారణంగా 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికీ మించి, తనకు అత్యంత ఆప్తమిత్రుడైన మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఒకటి రెండుసార్లు ఎన్‌పిఆర్‌ విషయమై చేసిన హెచ్చరికలతో వైఎస్‌ జగన్‌ దిగొచ్చినట్లే కన్పిస్తోంది.

అయితే, పార్లమెంటులో మద్దతిచ్చి, ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ రివర్స్‌ గేర్‌ వేయడం పట్ల సర్వతా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క, వైఎస్‌ జగన్‌ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ వైసీపీ సానుభూతిపరులైన మైనార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. జగన్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించకముందు, వైసీపీకి చెందిన కొందరు నేతలు, తమ పదవులకు రాజీనామా చేస్తామంటూ సీఏఏ, ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సిలపై నిరసన గళం విన్పించిన విషయం విదితమే.

ఇదిలా వుంటే, వైఎస్‌ జగన్‌ అత్యంత వ్యూహాత్మకంగా ప్లేటు ఫిరాయించారనీ, ఈ పరిణామాలు ఆయనకు ముందు ముందు రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తాయనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నట్టు, తెలంగాణ ప్రభుత్వం కూడా సీఏఏని వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...