ఓ తెలుగు సినిమాలో విలన్, ‘చెల్లి పెళ్ళి.. జరగాలి మళ్ళీ మళ్ళీ..’ అంటాడు. అప్పట్లో అదో సూపర్ హిట్ కామెడీ డైలాగ్. ఆ డైలాగుని, ఆంధ్రపదేశ్ రాజకీయాలకు ఆపాదిస్తున్నారు నెటిజన్లు. చంద్రబాబు హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న కర్నూలు విమానాశ్రయానికి నేడు ప్రారంభోత్సవం చేశారు వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
నిజానికి, చంద్రబాబు హయాంలో ఓ సారి ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుపుకుంది. మళ్ళీ ఇన్నాళ్ళకు.. అంటే, దాదాపు రెండేళ్ళ తర్వాత వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇంకోసారి ప్రారంభోత్సవం జరుపుకుంది కర్నూలు విమానాశ్రయం. మళ్ళీ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఇంకోటేదన్నా వస్తే, అప్పుడు ఇంకోసారి కొత్త ముఖ్యమంత్రి ఈ విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేయాలేమో.
ప్రయాణీకుల విమానాలు నేటి నుంచి అందుబాటులోకి వస్తాయి గనుక.. అని అధికార పార్టీ ‘రెండో ప్రారంభోత్సవాన్ని’ సమర్థించుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అసలే, బోరింగులకీ.. సెలూన్లకీ, ఆఖరికి.. పెంపుడు జంతువుల షెడ్లకు కూడా అధికార పార్టీ నేతలు ‘ప్రారంభోత్సవాలు’ చేసేస్తున్న వైనంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న విషయం విదితమే.
ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్, కర్నూలు విమానాశ్రయం నుంచి ప్రయాణీకుల విమానాల సేవల్ని ప్రారంభించకూడదని ఎవరైనా అనగలరా.? అయితే, ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకున్న విమానాశ్రయానికి ఇంకోసారి ప్రారంభోత్సవం.. అది ఏ కారణంగానైనా.. సబబు కాదు.
రాయలసీమలోని తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, అదే రాయలసీమకి చెందిన కర్నూలుకి ‘జ్యుడీషియల్ క్యాపిటల్’ హోదాపై ఇంకాస్త స్పష్టత ఇచ్చేలా విపరీతమైన హంగామా నడుమ జరిగిన ఈ ప్రారంభోత్సవం విపక్షాల విమర్శలకు అధికార పార్టీ ఏం సమాధానమిస్తుందో వేచి చూడాలి.
987497 609128It is perfect time to make some plans for the future and it is time to be happy. Ive read this post and if I could I wish to suggest you some fascinating issues or suggestions. Maybe you can write next articles referring to this article. I want to read even more items about it! 480959
304333 437794you can have an ideal blog proper here! would you prefer to make some invite posts on my weblog? 794769
424062 454151You would endure heaps of different advised organized excursions with various chauffeur driven car experts. Some sort of cope previous capabilities and a normally requires a to obtain travel within expense centre, and even checking out the upstate New York. ??????? 353961