Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘పచ్చ’ మీడియా రంగు మారిపోతుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగు మీడియా రంగంలో.. అందునా, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సంబంధించి ‘పచ్చ మీడియా’ గురించి చాలాకాలంగా వింటున్నాం. ఈ మధ్య ‘బ్లూ మీడియా’ అనే ప్రస్తావన ఎక్కువగానే వస్తోంది. టీడీపీ అనుకూల మీడియాని ‘పచ్చ మీడియా’గా, వైసీపీ అనుకూల మీడియాని ‘బ్లూ మీడియా’గా అభివర్ణిస్తున్నాయి ఆయా రాజకీయ పార్టీలు. ఎలా చూసుకున్నా నిన్న మొన్నటిదాకా తెలుగు మీడియా రంగంలో ‘పచ్చ మీడియా’దే పై చేయి.

కానీ, పరిస్థితులు మారుతున్నాయి. క్రమక్రమంగా ‘పచ్చ మీడియా’ బలం తగ్గిపోతోంది. అందుక్కారణం, టీడీపీ రాజకీయంగా రోజురోజుకీ తన ఉనికిని కోల్పోతుండడమే. తెలంగాణలో ఎప్పుడో ఆ పార్టీ గల్లంతయిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ టీడీపీ పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. టీడీపీకి జాకీలెయ్యాలని ‘పచ్చ మీడియా’ ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం వుండడంలేదు.

మరోపక్క, ‘పచ్చ మీడియా’పై రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువైపోయాయి. తెలంగాణలో దాదాపుగా ‘పచ్చ మీడియా’ అధికార టీఆర్‌ఎస్‌కి సరెండర్‌ అయిపోయింది. ముందు ముందు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి పచ్చ మీడియాకి ఎదురు కావొచ్చనే చర్చ అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు మీడియా వర్గాల్లోనూ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా సంస్థలుగా ప్రచారంలో వున్న కొన్ని మీడియా సంస్థల్ని వైసీపీ తనవైపుకు తిప్పుకుంది.

వైసీపీ మద్దతుదారులైన ప్రముఖ వ్యాపారవేత్తలు, ఆయా మీడియా సంస్థల్ని సొంతం చేసుకునే పనిలో బిజీగా వున్నారు. ‘ఆ రెండు మీడియా సంస్థలు’ కాకుండా మరో మీడియా సంస్థ మాత్రమే ఇప్పుడు పూర్తి స్థాయిలో టీడీపీకి మద్దతిస్తోంది. ముందు ముందు, ‘ఆ మూడిటిలో’ ఒకటి, టీడీపీ చేజారిపోనుందని సమాచారం. యాజమాన్య మార్పు త్వరలో జరగబోతోందనీ, ఇప్పటికే టీడీపీ అనుకూల జర్నలిస్టులకు మేటర్‌ అర్థమయి, తమ దారి తాము చూసుకుంటున్నారనీ మీడియా వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

తాము ఏం చేసినా, దాన్ని తమ అనుకూల మీడియా నుంచి మద్దతు వస్తుందని ఇన్నాళ్ళూ విర్రవీగిన టీడీపీకి, ఇకపై ఆ భరోసా కూడా లేకపోతే ఎలా.? ఇదే చాలామంది తెలుగు తమ్ముళ్ళని వెంటాడుతోన్న ప్రశ్న. ఆర్థిక మూలాలు దెబ్బతింటోన్న దరిమిలా, కొందరు నేతలు టీడీపీకి దూరం కాక తప్పడంలేదు. టీడీపీ అనుకూల మీడియా సంస్థలకూ అదే పరిస్థితి ఎదురవుతుండడాన్ని ‘స్వయంకృతాపరాధం’గా భావించొచ్చేమో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....