Switch to English

అమరావతిపై ‘కమ్మ’టి పలుకు.! తేడా అక్కడే వుంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పచ్చ మీడియాగా పేరొందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ అధిపతి ప్రతి వారం రాసే ‘పలుకు’ ఎప్పటికప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారుతుంటుంది. మీడియా వర్గాల్లో అయితే, బోల్డంత చర్చకు కారణమవుతుంటుంది. దాదాపుగా ఈ పలుకు మీద సెటైర్లే పడుతుంటాయి తప్ప, ‘నిజమే కదా.!’ అని ఎవరూ అనే పరిస్థితి వుండదు.

నిజంగానే ఆ ‘చెత్త పలుకు’లో నిజాలున్నా, ఆ పలుకులు చెప్పే వ్యక్తి ‘వ్యక్తిత్వం’ నేపథ్యంలో అవి చెత్త పలుకులుగా మిగిలిపోతున్నాయి. అమరావతిని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా కొనసాగించి వుంటే.. అంటూ దీర్ఘం తీశారు ‘చెత్త పలుకు’లో. అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా కొనసాగి వుంటే, బోల్డంత అభివృద్ధి జరిగిపోయేదట. ఇదీ సదరు ‘చెత్త పలుకు’ ఉవాచ. ఏమో.. నిజమేనేమో.!

కానీ, చంద్రబాబు హయాంలో ఎందుకు అభివృద్ధి చెందలేదట.? 2018 చివరి నాటికే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాజెక్టుకి సంబంధించి తొలి ఫేజ్‌ పూర్తి చేసి, తన సత్తా చాటి చెప్తానన్నారు టీడీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఏదీ.? ఎక్కడ.? అమరావతి ఫస్ట్‌ ఫేజ్‌ ఏమయ్యింది.? అని ఇప్పుడు వెతుక్కోవాలి అమరావతిలో.

‘కేంద్రం, ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వలేదు’ అని ఓవరాక్షన్‌ చేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే, అమరావతిని ‘తనంతట తానుగా అభివృద్ధి చెందే ప్రాజెక్టు’ అని పదే పదే చెప్పుకుంటూ వస్తోంది తెలుగుదేశం పార్టీ. టీడీపీ గనుక, ఓ ఫేజ్‌ని తన హయాంలో పూర్తి చేసి వుంటే.. ఇప్పుడీ దుస్థితి దాపురించేది కాదేమో అమరావతికి.

ఇక, అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ తప్పిదాల్ని ఎలా విస్మరించగలం.? రాజధాని అమరావతిలో ఎలాంటి అభివృద్ధీ లేకుండా ఏడాది కాలం పాటు ‘ఎక్కడి పనులు అక్కడే నిలిపేయడం’ అంటే, రాష్ట్రం మీద అధికార పార్టీకి వున్న ‘బాధ్యత’ ఏంటి.?

టీడీపీ పలికే ‘కమ్మ’టి పలుకులు.. ఆ ‘కమ్మ’టి పలుకుల మీద గుస్సా అయ్యే బులుగు మీడియా.. వెరసి.. పచ్చ రాజకీయాలు.. బులుగు రాజకీయాలు ఓ ఖచ్చితమైన అవగాహనతో రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

రాజధాని అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ‘ఆధిపత్య పోరు’లా తయారవడం, రాష్ట్ర ప్రజలకు శాపం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...