Switch to English

రఘురామని కొట్టారా.? లేదా.? ఆర్మీ ఆసుపత్రిలో ఏం తేలుతుంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

హైద్రాబాద్ నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి గుంటూరుకి తరలించిన ఏపీ సీఐడీ, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తిరిగి హైద్రాబాద్ తరలించాల్సి వుంది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు జరగనున్న విషయం విదితమే. అయితే, ఈలోగా ఏపీ సీఐడీ, సుప్రీంకోర్టుకి ప్రత్యేకంగా ఏమైనా విన్నవించుకునే అవకాశం వుందా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

లేదూ, సుప్రీం ఆదేశాలే అమలైతే, తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడీషియల్ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు జరుగుతాయి. ఇంతకీ, ఆ వైద్య పరీక్షల్లో ఏం తేలనుంది.? గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు, రఘురామకృష్ణరాజుని పోలీసులు కొట్టారనడానికి ఎలాంటి ఆధారాల్లేవని చెబుతున్నారు. కాళ్ళు వాచి, ఎర్రగా అయినంతమాత్రాన అవి ఎవరో కొట్టిన దెబ్బలని చెప్పలేం.. అన్నది గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఇచ్చిన నివేదిక. హార్ట్, కిడ్నీలు.. ఇలా ప్రధాన శరీర అంతర్గత అవయవాలన్నీ సరిగ్గానే పనిచేస్తున్నట్లు కూడా ఆ నివేదికలో స్పష్టం చేశారు.

కానీ, రఘురామ తరఫు న్యాయవాదుల వాదన ఇంకోలా వుంది. ఏపీ సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం అంత ధీమాతో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినా, ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం సుప్రీంకోర్టు ఎందుకు ఆదేశాలు ఇచ్చిందన్నదే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం. మామూలుగా అయితే, వైద్య పరీక్షల ఫలితాలు ఎక్కడైనా ఒకేలా వుండాలి. కానీ, ఇది దిక్కుమాలిన రాజకీయాల కాలం. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకలా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంకోలా నివేదికలు వుంటున్నాయి.

పైగా, గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ మీద కూడా రాజకీయ ఆరోపణలు వస్తున్నాయిప్పుడు. దాంతో, సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి ఇవ్వబోయే వైద్య నివేదిక అత్యంత కీలకం కాబోతోంది. అది తమ వాదనలకు బలాన్నిస్తుందని ఇరు వర్గాలూ పైకి గంభీరంగా చెబుతున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో.ఏం తేలుతుందో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...