Switch to English

సొంతూళ్లకు పోటెత్తిన ఓటర్లు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ప్రజాస్వామ్యంలో తిరుగులేని పాశుపతాస్త్రం.. ఓటు. వజ్రాయుధాన్ని మించిన శక్తివంతమైన ఈ ఆయుధమే మన తలరాతను నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఓటును వినియోగించుకునే విషయంలో తెలుగు ప్రజల్లో చైతన్యం ఎక్కువే. అందుకే గురువారం జరిగే ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓట్లేసేందుకు జనం సొంతూళ్లకు పోటెత్తారు. రైళ్లు, బస్సుల్లో టికెట్లు లేకపోయినా, స్పెషల్ బస్సులు కూడా ఫుల్ అయినా, ఎలాగైనా ఊరెళ్లి ఓటేసి రావాల్సిందేనని గట్టిగా తీర్మానించుకున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు దాదాపు 12 లక్షల మంది తరలి వెళ్లినట్టు అంచనా. ఇక మంగళ, బుధవారాల్లో మరో ఏడెనిమిది లక్షల మంది సొంతూళ్లకు పయనం కానున్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు వేసినా, తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు స్పెషల్ బస్సులు నడుపుతున్నా.. రద్దీ మాత్రం తీవ్రంగా కొనసాగుతోంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్ అయితే ఈ రద్దీని సొమ్ము చేసుకుంటున్నాయి. చార్జీలను అమాంతం పెంచేసి, సగటు ఓటరుని దోచుకుంటున్నాయి.

సాధారణ సమయాల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు నాన్ ఏసీ బస్సు చార్జీ 350 ఉండగా.. ప్రస్తుతం అది 700కి పైగా పెంచేశారు. ఇక అమలాపురం, రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు అయితే రూ.2వేల నుంచి 2,500 మధ్య టికెట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇవి కాకుండా ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు సొంతంగా రవాణా వసతి ఏర్పాటు చేశారు. నేతలు ఏర్పాటు చేసిన బస్సుల్లో వెళ్లేవారి కంటే సొంతంగా చార్జీలు పెట్టుకుని వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

వాస్తవానికి ఏపీలో ఓటు హక్కు ఉండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నవారి సంఖ్య దాదాపు 25 లక్షలకు పైనే ఉంటుందని అంచనా. వీరంతా ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, ఓటు హక్కు మాత్రం సొంత ఊళ్లోనే ఉంచుకున్నారు. అక్కడ ఎవరిని గద్దెనెక్కించాలో నిర్ణయించేది వీరే. గత ఎన్నికల సమయంలో రికార్డు స్థాయిలో ఏకంగా దాదాపు 25 లక్షల మంది హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి ఓటేసి వచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఆ ఎన్నికల్లో అనుభవశాలి అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు పట్టం కట్టాలనే ఉద్దేశంతో.. యువత గట్టిగా నిర్ణయం తీసుకుని తమ తమ ప్రాంతాలకు పయనమయ్యారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో స్వచ్ఛందంగా అప్పుడు తరలి వెళ్లారు. అదే ఒరవడి ప్రస్తుతం కూడా కొనసాగుతోంది.

వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టుకుని ఏం వెళతాంలే అని అనుకోకుండా ఓటు అనే పాశుపతాస్త్రాన్ని సంధించడానికి జన్మభూమికి వెళుతున్నారు. ఏపీలో ఎవరికి పట్టం కట్టాలో డిసైడ్ చేసేది మేమే అంటూ కదం తొక్కి దూసుకెళ్తున్నారు. ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలు హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ప్రతి ఓటూ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఉప్పెనలా తరలి వెళుతున్న ఏపీ వాసులు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...