Switch to English

రెడ్లంతా వైసీపీకి ఓట్లయ్యాలి.. రెడ్లు కాకపోయినా ఓటు వైసీపీకే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారంతా తప్పనిసరిగా వైసీపీనే తమ సొంత పార్టీగా భావించి ఓట్లెయ్యాలి. ఇతర పార్టీల నుంచి రెడ్లు బరిలో వున్నప్పటికీ కూడా, ఆయా పార్టీలకు రెడ్లు ఓటెయ్యకూడదు.. కాపులు కూడా రెడ్డి పార్టీ అయిన వైసీపీకే ఓటెయ్యాలి.. నా సర్టిఫికెట్లలో కూడా కాపు అనే వుంటుంది..’ అంటూ అధికార పార్టీ నేతలు కుల సంఘాల సమావేశాల్లో కుండబద్దలుగొట్టేస్తున్నారు.

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, గ్రేటర్ విశాఖ ఎన్నికల నేపథ్యంలో రెడ్డిక (రెడ్డి కాదు, రెడ్డిక.. రెడ్డిక అనేది ఉత్తరాంధ్రలో బీసీ కేటగిరీకి చెందిన సామాజిక వర్గం) సామాజిక వర్గానికి చెందిన ఓ కార్యక్రమం వేదికగా చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు విసారె. ‘నా సర్టిఫికెట్లలో కూడా కాపు అనే వుంటుంది..’ అని సెలవిచ్చారు విసా రెడ్డిగారు.

‘మతం చూడం.. కులం చూడం.. అందరికీ సంక్షేమ పాలన.. సమానంగా..’ అని ఓ వైపు చెబుతూనే, ఇంకో వైపు అధికార పార్టీ, ఫక్తు ‘రెడ్డి’ రాజకీయాలు చేస్తోంది. వైసీపీని రెడ్డి పార్టీ అనీ, టీడీపీని కమ్మ పార్టీ అనీ, జనసేనను కాపు పార్టీ అనీ.. కొందరు అభివర్ణిస్తోన్న విషయం విదితమే. వైసీపీ హయాంలో పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ, ‘కీలక పదవులు’ అప్పగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

గతంలో, చంద్రబాబు తన సొంత సామాజిక వర్గం ‘కమ్మ సామాజిక వర్గం’కి అగ్రతాంబూలమిచ్చారు. ఇలా ఈ రెండు పార్టీలూ ‘కులం’ పేరుతో, ‘మతం’ పేరుతో రాజకీయాలు చేస్తూ, జనసేన మీద ‘కాపు ముద్ర’ వేసేందుకు ప్రయత్నిస్తుండడాన్ని ‘రాజకీయ వ్యభిచారం’ అంటే తప్పేముందట.?

సరే, రెడ్డి సామాజిక వర్గం అంతా వైసీపీ వెంట వుంటుందా.? కమ్మ సామాజిక వర్గమంతా టీడీపీ వైపు వుంటుందా.? అంటే, ‘అంత సీన్ లేదు’ అనే సమాధానం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. కులాభిమానం వేరు.. రాజకీయం వేరు. లేకపోతే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు, వైసీపీలో తప్ప ఇతర పార్టీల్లో వుండకూడదు. కమ్మ సామాజిక వర్గ నేతలంతా టీడీపీలోనే వుండాలి. అలా జరగడంలేదు కదా.? అయినాగానీ, రాజకీయ పార్టీల ‘కక్కుర్తి’ మాత్రం కుల రాజకీయాల్ని, మత రాజకీయాల్నీ ప్రేరేపిస్తూనే వుంటుంది.

కులాల ఓట్లను లాగేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ ప్రయత్నిస్తోంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోంది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...