Kushi : విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన ఖుషి సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా లో విభిన్నమైన కథను అన్ని వర్గాల వారిని అలరించే స్క్రీన్ ప్లేతో చూపించడం జరిగిందంటూ రివ్యూలు వచ్చాయి.
రౌడీ స్టార్ విజయ్ గత చిత్రాల అనుభవం నేపథ్యం లో ఈ సినిమా పై అంచనాలు మొదట్లో చాలా తక్కువ అని చెప్పాలి. కానీ ఎప్పుడైతే సినిమా విడుదల అయిందో అప్పుడే సినిమా రేంజ్ ఏంటో తెలిసి పోయింది. మొదటి రోజు నుండి భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కి చేరువ అయింది.
నైజాం ఏరియాతో పాటు యూఎస్ లో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయింది. ఖుషి సినిమా యూఎస్ లో 1.6 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేయడం జరిగింది. మిలియన్ డాలర్ల టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా కు వస్తున్న వసూళ్లు ఆశ్చర్యంను కలిగిస్తున్నాయి. రెండు మిలియన్ లు ఈజీగా రాబట్టడం ఖాయం. ఆ పై ఎంత రాబడుతుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా యూఎస్ వసూళ్లు నమోదు అవుతున్నాయి.