కన్నడ సూపర్ స్టార్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో ఉపేంద్ర సినిమాల్లో ఎలాంటి భిన్నత్వాన్ని చూపిస్తాడో .. అయన సినిమాలో ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఉపేంద్ర. కర్ణాటక రాజకీయాలు మారాలని అయన పోరాటం చేస్తున్నాడు. ఇప్పటికే యూత్ లో ఉపేంద్ర అంటే ఓ రేంజ్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అయన సమాజ సేవలో భాగంగా రిలే నిరాహారదీక్ష చేయడానికి సిద్దమయ్యాడు.
ఈ నెల 14, 15 వ తేదీల్లో ఉపేంద్ర నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించాడు. ఉపేంద్ర నిరాహార దీక్ష చేయడానికి కారణం .. అక్కడి యువత కోసమే. కర్ణాటకలో ఎక్కువమంది అక్కడ ఉద్యాగాలు చేసే వాళ్లలో ఇతర ప్రాంతాలనుండి వచ్చిన వారే ఎక్కువని, దానివల్ల లోకల్ గా ఉన్న వాళ్లకు అవకాశాలు దొరకడం లేదని, దాంతో తీవ్రంగా నిరుద్యోగ సమస్య ఏర్పడిందని తెలుసుకున్న ఉపేంద్ర స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన పెట్టాలని, దానికొసం తాను ఈ పోరాటం చేస్తున్నట్టు ప్రకటించాడు.
ఉపేంద్ర ప్రకటనతో కన్నడ నాట యువత ఆయనకు సపోర్ట్ గా నిలబడుతున్నారు. స్థానిక నిరుద్యోగులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ నిరాహార దీక్షకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఉపేంద్ర తో పాటు భారీ స్థాయిలో యువత పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.
107148 877269Sweet web site , super pattern , rattling clean and use friendly . 996803
637713 752548Excellent blog here! Also your web site loads up very fast! What host are you making use of? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as quick as yours lol xrumer 564174