కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమి కాదు. గతంలో డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా చేసిన ఉపేంద్ర, కీలకమైన పాత్రలు పోషించడానికి కూడా సై అన్నాడు. ఆఖరుగా తెలుగులో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ముఖ్యమైన పాత్రలో మురిపించాడు ఉపేంద్ర. తనకు తెలుగులో సినిమాలు చేయడానికి అభ్యంతరం ఏం లేదని కాకపోతే తనకు పాత్ర బాగా నచ్చితేనే సినిమాకు సంతకం చేస్తానని తెలిపాడు. తనకు ఈ మధ్య కాలంలో తెలుగులో అలాంటి పాత్రేమీ దక్కలేదని తెలిపాడు. అయితే వరుణ్ తేజ్ సినిమాలో మాత్రం నటిస్తున్నట్లు ఆ పాత్ర తనకెంతో నచ్చిందని తెలిపాడు.
ఇంతకీ ఆ పాత్ర విశేషాలు ఏమిటని ఆరా తీస్తే నిజంగా విశేషంగానే చెప్పుకోవాలి. ఇన్నాళ్లూ పవర్ఫుల్ పాత్రలు, విలన్ పాత్రలు పోషించిన ఈ కన్నడ స్టార్ హీరో తొలిసారి హీరోకి తండ్రి పాత్రలో కనిపించనున్నాడట. వరుణ్ తేజ్ కు తండ్రిగా ఉపేంద్ర నటిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రం అవ్వడానికి బాక్సింగ్ ప్రాధాన్యమున్న సినిమానే అయినా తండ్రీ కొడుకుల మధ్య బాండింగ్ అనేది హైలైట్ గా ఉంటుందని, వారిద్దరి మధ్య సీన్స్ ఆకట్టుకుంటాయని సమాచారం.
కిరణ్ కొర్రపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి కరోనా వైరస్ కారణంగా బ్రేకులు పడిన విషయం తెల్సిందే.
308365 20817All you need to have to know about News details to you. 554152
970834 320765I like this weblog so much, saved to my bookmarks . 414616
695251 429816I love the appear of your website. I lately built mine and I was looking for some ideas for my site and you gave me a few. Might I ask you whether you developed the internet site by youself? 72673