తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ ఎప్పటికప్పుడు సరికొత్త వివాదాలు తెరపైకొస్తుంటాయి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా శ్రీవారి లడ్డూల్ని ‘ఎన్నికల తాయిలం’ కింద కొందరు ‘పంపకాలు’ చేపట్టిన వైనం అప్పట్లో పెను సంచలనం. అసలా పాపానికి ఒడిగట్టిందెవరు.? ఎందుకు ఆ పని చేశారు.? అన్నదానిపై ఇప్పటికీ నిజాలు నిగ్గు తేలలేదు.
తాజా వివాదం ఏంటంటే, సిఫారసు లేఖల ద్వారా ‘శ్రీవారి సేవ’కు వచ్చే భక్తులను నిలువు దోపిడీ చేసేందుకు టీటీడీ సంసిద్ధమవడం. ‘వై ఎనిమిది వందలు.. రెండు వేల ఐదొందలు చేసెయ్..’ అంటున్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఓ సేవ ధర పెంపు విషయమై పాలక మండలి సమావేశంలో. ఇంకొకాయన అయితే, 45 నిమిషాలు కూర్చుంటారు.. పది వేలు పెంచేస్తే సరి.. అంటున్నారు.
అసలేం జరుగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో.? సిఫారసుల సంఖ్య తగ్గించేందుకోసమే ఈ చర్యలంటూ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇస్తున్నా, ఇంత దారుణంగా ధరల్ని పెంచేయడం ఎంతవరకు సబబు.? సిఫారసులే అయినాగానీ, వాళ్ళు కూడా భక్తులే కదా.? అలాంటివారిని దోచెయ్యడం అస్సలేమాత్రం సబబు కాదన్నది కొందరి అభిప్రాయం.
సామాన్య భక్తులకు పెద్దపీట వేయాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అసలంటూ దైవదర్శనం విషయంలో ప్రోటోకాల్ ఎందుకు.? శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాల పేరుతో లూటీ చేయడమెందుకు.? అన్న ప్రశ్న ఎప్పటినుంచో భక్తుల నుంచి వినిపిస్తోంది.
సామాన్యుడి నుంచి, అధికారులు, ప్రభుత్వ పెద్దలు.. ఎవరైనా దేవుడి దృష్టిలో ఒకటే అయినప్పుడు, ఒక్కొక్కరికి ఒక్కోలా దైవ సన్నిధిలో ‘మర్యాదలు’ ఎందుకు దక్కుతున్నట్లు.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
లడ్డూల ధరల్ని పెంచేయడం, వసతి గదుల అద్దెల్ని పెంచేయడం.. ఇవన్నీ దేనికి.? భక్తుల్ని తగ్గించడానికా.? జనంలో భక్తిని తగ్గించడానికా.? రేట్లు పెంచడం ద్వారా సిఫార్సుల్ని తగ్గించాలన్నదే లక్ష్యమైనప్పుడు.. ‘భక్తి’ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదన్నది సాధారణ భక్తుల ప్రశ్న.
639736 1267i would need to make much more christmas cards becuase next month is december already- 155121
447458 317641Ive been absent for some time, but now I remember why I used to adore this weblog. Thank you, I will try and check back a lot more often. How frequently you update your web web site? 898994
863110 955815Thanks for the information. And a response from you. car dealers hips san jose 825414
112938 698500Wow that was strange. I just wrote an incredibly long comment but following I clicked submit my comment didnt appear. Grrrr properly Im not writing all that over again. Regardless, just wanted to say wonderful blog! 159229