Switch to English

ట్రంప్‌ని ఓడించిందెవరు.? బైడెన్‌ని గెలిపించిందెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

వైఎస్‌ జగన్‌ ఫార్ములాని అనుసరించకపోవడమే ట్రంప్‌ ఓటమికి కారణమట.. చంద్రబాబు ఆశీస్సులతోనే జో బైడెన్‌ గెలిచారట.. ఇదీ ‘బ్లూ’ పైత్యం. ఒకటేమో బ్లూ మీడియా విశ్లేషణ.. ఇంకోటి వైసీపీ నేత వెటకారం. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్లుంది కదూ ఈ మొత్తం వ్యవహారం. అమెరికా అధ్యక్ష ఎన్నికలకీ, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకీ లింకుందా.? అన్న చర్చ ఇంకెక్కడన్నా జరిగితే, చాచిపెట్టి లెంపకాయ కొట్టేస్తారు.. ఆ చర్చను తెరపైకి తెచ్చినోళ్ళని.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌ని ప్రపంచమంతా అభినందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ పలువురు రాజకీయ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా అభినందించారు జో బైడెన్‌నీ, ఉపాధ్యక్షురాలిగా గెలిచిన కమలా హారిస్‌నీ. కమలా హారిస్‌ భారతీయ మూలాలున్న వ్యక్తి. దాంతో మన భారతీయ ఆడపడుచు అమెరికా ఉపాధ్యక్షురాలయ్యిందన్న ఆనందం ప్రతి భారతీయుడిలోనూ వుంది. అది వేరే చర్చ.

వైఎస్‌ జగన్‌ ఫార్ములా ఏంటి.? డోనాల్డ్‌ ట్రంప్‌ అనుసరించకపోవడమేంటి.? అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికలేంటి.? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిస్థితులేంటి.? ఇక్కడి అవసరాలేంటి.? అక్కడి రాజకీయ ప్రాధాన్యాలేంటి.? ఇలాంటి ఇంగితం వున్న ప్రశ్నల్ని ఒక్కసారి తమకు తాము సంధించుకుంటే, ఆ పోలికే రాదు. గతంలో చంద్రబాబుకి ఈ తరహా ఆలోచనలు వుండేవి.. ప్రపంచాన్ని తానే ఉద్ధరించేసినట్లు. వైసీపీనే, చంద్రబాబుని ఈ విషయంలో పదే పదే విమర్శిస్తుంటుంది.

అలాంటిది వైసీపీ అనుకూల మీడియాలో, ట్రంప్‌ ఓటమికీ.. వైఎస్‌ జగన్‌ వ్యూహాలకీ లింకు పెట్టడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? అమెరికా అధ్యక్ష ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్ని ముడిపెడితే తమను ఛీకొడతారన్న ఇంగితం లేకుండా.. వెటకారానికో, విశ్లేషణకో ఆ రెండు అంశాల్నీ ముడిపెట్టడం అత్యంత జుగుప్సాకరం. ‘ఇటీవల ఇండియాకి వచ్చిన ట్రంప్‌, వైఎస్‌ జగన్‌ని కలవలేదు.. అందుకే ఓడిపోయాడు..’ అంటూ కొందరు వైసీపీ మేధావులు సోషల్‌ మీడియాలో పైత్యాన్ని వెదజల్లిన వైనం ఇక్కడ ప్రస్తావనార్హం.

తెలుగు తమ్ముళ్ళు కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదండోయ్‌. ఈ పచ్చ మేధావులు, బ్లూ మేధావులు.. ఆంధ్రప్రదేశ్‌ ఇమేజ్‌ని ప్రపంచ వేదికలపైనా నాశనం చేస్తున్నారన్నమాట.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...