ఆరడుగుల ఆజాను బాహుడు, విలన్స్ ని కొడితే గాల్లోకి లేచినా ఆడియన్స్ ఎంజాయ్ చేయగల ఇమేజ్ ఉన్న టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన స్పై థ్రిల్లర్ మూవీ ‘చాణక్య’. గోపీచంద్ మొదటిసారి కంప్లీట్ గా తన లుక్ చేంజ్ చేసి ఇండియన్ రా ఏజంట్ గా చేస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం అందరికీ తెలిసిందే. తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్, జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా నటించారు.
యాక్షన్ లవర్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి కూడా బాగా నచ్చుతుందని ఈ చిత్ర టీం చెబుతోంది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ‘చాణక్య’ సినిమా 11.5 కోట్ల ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ చేసింది. అలాగే గోపీచంద్ చివరి సినిమా ‘పంతం’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడింది. అలాగే ఈ సినిమాకి పోటీ ఆల్రెడీ సైరా’ తో స్టార్ట్ అయిపొయింది. కానీ దసరా సీజన్ హాలిడేస్ కారణంగా చాణక్యకి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
మా ట్రేడ్ రిపోర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ‘చాణక్య’ సినిమా మొదటి రోజు సుమారు 3 కోట్ల షేర్ రిజిష్టర్ చేస్తుందని చెబుతున్నారు. 3 కోట్ల మార్క్ టచ్ చేస్తే ‘చాణక్య’ గోపీచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమా అవుతుంది. మరి ‘సైరా’ని దాటుకొని ‘చాణక్య’ ఏ రేంజ్ ఓపెనింగ్స్ సాధిస్తుందో తెలియాలి అంటే మరొక్కరోజు వేచి చూడక తప్పదు.
‘చాణక్య’ లైవ్ అప్డేట్స్ మరియు రివ్యూ కోసం మా https://www.telugubulletin.com/ సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.
