Switch to English

దుబ్బాక టు తిరుపతి.. వయా జీహెచ్‌ఎంసీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని ఎవరైనా ఊహించారా.? గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలదని ఎవరైనా అంచనా వేశారా.? అసలు పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ ఎలా మారుతున్నాయో అర్థం కాని పరిస్థితి. అటు దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ, ఇటు గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల సమయంలోనూ మారిన ఈక్వేషన్స్‌ ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులకు మింగుడుపడ్డంలేదు. అక్కడా ఇక్కడా ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు తారుమారయ్యాయి. అసలేం జరుగుతోంది.? బీజేపీ ఎలా ఓటర్లను తనవైపుకు తిప్పుకోగలుగుతోంది.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

నిజానికి, తిరుపతి ఉప ఎన్నిక గురించి చర్చించుకోవాలంటే భారతీయ జనతా పార్టీకి అంత సీన్‌ లేదు. ఆ పార్టీకి డిపాజిట్‌ కూడా రావడం కష్టమే ఇప్పుడున్న పరిస్థితుల్లో. జనసేన పార్టీదీ ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏమీ కాదుగానీ, బీజేపీతో పోల్చుకుంటే కాస్త బెటర్‌. ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేసినా, అక్కడ రెండో స్థానంలోకి వచ్చే టీడీపీతో పోటీ పడటం కూడా కష్టం. ఇది సాధారణ విశ్లేషణ.

రాయలసీమలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని బలం వుంది. పైగా, తిరుపతి సిట్టింగ్‌ సీటు వైసీపీదే. ఆ లెక్కన, చాలా తేలిగ్గానే తిరుపతి ఉప ఎన్నికను వైఎస్సార్సీపీ గెల్చుకోవచ్చు. కానీ, ఈసారి మాత్రం రాజకీయ విశ్లేషకులు ఆచి తూచి విశ్లేషిస్తున్నారు తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన ప్రస్తావనకు వస్తే. దుబ్బాక మొదటి ప్రమాద హెచ్చరిక.. జీహెచ్‌ఎంసీ రెండో ప్రమాద హెచ్చరిక.. తిరుపతిలో మాత్రం బీజేపీ తుపానులో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం.. అన్నది తాజాగా రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చల సారాంశం.

ముందే చెప్పుకున్నాం కదా.. మామూలుగా అయితే, బీజేపీ.. తిరుపతిలో సత్తా చాటడం అనేది అసాధ్యం. కానీ, ఇప్పుడు ఈక్వేషన్స్‌ మారిపోయాయ్‌. అసలు బీజేపీ ఎలా పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తోందో కూడా ఎవరికీ అంతుబట్టడంలేదు. గ్రేటర్‌ హైద్రాబాద్‌కి సంబంధించినంతవరకు చూసుకుంటే, నార్త్‌ ఇండియన్స్‌ని బాగా తనవైపుకు తిప్పుకోగలిగింది బీజేపీ. హిందుత్వాన్ని రగిల్చింది.. అన్నిటికీ మించి ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’ అనే మాట అంచనాలకు భిన్నంగా వర్కవుట్‌ అయ్యిందనే చెప్పాలి. దుబ్బాకలో ఓ అస్త్రం… జీహెచ్‌ఎంసీలో మరిన్ని అస్త్రాలు.. మరి, తిరుపతిలో బీజేపీ అస్త్రాలు ఏంటి.? ఇదైతే ప్రస్తుతానికి సస్పెన్సే. ఒక్కటి మాత్రం నిజం.. వైసీపీకి, తిరుపతి ఉప ఎన్నిక అంత ఆషామాషీ వ్యవహారం కాదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...