Vijay : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తమిళనాట రాబోతున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి విజయ్ రాజకీయ పార్టీతో రెడీగా ఉంటాడట.
గత కొన్నాళ్లుగా తమిళ మీడియాలో ఈ కథనాలు జోరుగా వస్తున్నాయి. పెద్ద ఎత్తున విజయ్ రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ జరుగుతోంది. ఆ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ అభిమాన సంఘం నుంచి పోటీకి నిల్చున్న విషయం తెల్సిందే. ఆ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి.
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా పొలిటికల్ డ్రామాతో ఉంటుందనే వార్తలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన రాజకీయ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం తమిళనాట రాజకీయ అనిశ్చితి ఉంది అని విజయ్ అండ్ కో భావిస్తున్నారట. అందుకే సోషల్ మీడియాలో ప్రముఖంగా ఈ విషయమై చర్చ జరుగుతోంది.