‘రన్ రాజా రన్’ సినిమాతో అందరి మెప్పూ పొందిన సుజీత్, ‘సాహో’ సినిమాతో మాత్రం చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 300 కోట్ల బడ్జెట్‌ని నిర్మాతలు ఇస్తే, ఆ స్థాయిలో సినిమా తీయలేకపోయాడన్నది ఆ విమర్శల సారాంశం. సినిమా విజయం సాధించాలంటే ఎన్ని కారణాలుంటాయో, పరాజయం పాలవడానికీ అన్నే కారణాలుంటాయి. ఇక, ‘సాహో’ పరాజయం సుజీత్‌కి అస్సలేమాత్రం నచ్చడంలేదు.
సుజీత్కే కాదు, ఏ దర్శకుడికీ తన సినిమా పరాజయం నచ్చదు. ఆ సంగతి పక్కన పెడితే, ప్రభాస్‌కి గుడి కట్టేయాల్సిందేనన్నది సుజీత్ ఇస్తోన్న ఉచిత సలహా. బీహార్ నుంచి ఎవరో ఫోన్ చేసి, ప్రభాస్ గనుక బీహార్‌లో పుట్టి వుంటే అతనికి గుడి కట్టేవాళ్ళమని చెప్పాడట. ఈ గుడి కట్టే సంప్రదాయం తమిళ సినీ అభిమానుల్లో కనిపిస్తుంటుంది.. అదీ అరుదుగా. హీరోయిన్లకి అక్కడ గుడి కట్టిన సందర్భాలున్నాయి.
తెలుగులో ఆ స్థాయి పైత్యం ఎవరికీ రాలేదు. స్వర్గీయ ఎన్టీఆర్కే గుడి కట్టలేదు. ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చిన్నదేమీ కాదు. నో డౌట్, తెలుగు సినిమాకి జాతీయ ఖ్యాతి ‘బాహుబలి’తో దక్కింది.. ఖ్యాతి మాత్రమే కాదు.. బాలీవుడ్ ఆశ్చర్యపోయే విజయం సాధించిన చిత్రమది. అఫ్కోర్స్, తెలుగు సినిమా సత్తా బాలీవుడ్‌కి గతంలోనూ చాటాం. ఇప్పుడు మరింత ఘనంగా చాటాం. ‘సాహో’ సినిమాతో ఇంకోసారి ఆ అద్భుతాన్ని చేసి చూపించాం. అంత మాత్రాన, ప్రభాస్‌కి గుడి కట్టేయాలంటే ఎలా.?
ఇదొక్కటే కాదు, సుజీత్ మనసులో ఆలోచనలు ఇంకా వైల్డ్‌గా వున్నాయి. రివ్యూలు ఒకటి రెండు రోజులు ఆలస్యంగా ఇవ్వాలట. ఇదేం వెర్రి ఆలోచన.? అన్నది చాలామంది అభిప్రాయం. సినిమా అలా స్క్రీన్ మీద పడిందో లేదో.. ఇలా ప్రపంచమంతా పాకేస్తోంది. ఆన్ ది స్పాట్ రివ్యూలు ప్రేక్షకులనుంచే బయటకు వచ్చేస్తున్నాయి. అంతా సోషల్ మీడియా మహిమ. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మీడియా సంస్థ ఇచ్చే రివ్యూల వల్ల సినిమాలపై ప్రభావం ఎంత పడుతుంది.? ఇవన్నీ తెలుసుకోలేనంత అమాయకుడైతే కాదు సుజీత్.
ఎందుకంటే, షార్ట్ ఫిలింస్ ద్వారా సోషల్ మీడియా ట్రెండ్‌ని బాగా అర్థం చేసుకున్నవాడే ఈ యువ దర్శకుడు. ‘సాహో’ సుజీత్ చెబుతున్నంత అద్భుతంగా వుంటే, ‘బాహుబలి’ కలెక్షన్లను దాటేసేదే. అలా జరగాలనే అంతా కోరుకున్నారు. కానీ, సినిమా పరాజయం పాలైంది. దాన్ని సుజీత్ హుందాగా అంగీకరిస్తే మంచిది.
238990 664537Whoa! This blog looks just like my old 1! It is on a entirely different topic but it has pretty much exactly the same layout and design. Outstanding choice of colors! 363346
444181 84701Im not that significantly of a internet reader to be honest but your web sites genuinely good, keep it up! Ill go ahead and bookmark your web site to come back later. All the greatest 499239
249775 460340Thank you pertaining to giving this outstanding content on your web-site. I discovered it on google. I may possibly check back once again in case you publish extra aricles. 165476
447789 592331Private Krankenversicherung – Nur dann, wenn Sie sich fr die Absicherung ber die Rentenversicherung entschieden haben, dann knnen Sie sich sicher sein, dass Sie im Alter so viel Geld haben, damit Sie Ihren Lebensstandard halten knnen. 814009