బిగ్‌బాస్ రియాల్టీ షో సందర్బంగా హౌస్ మేట్స్ మధ్య గొడవలు, హౌస్‌కే పరిమితం కావాల్సి వుంటుంది. బయటకు వచ్చాక ఎవరి లైఫ్ వారిది. లోపల జరిగేదంతా జస్ట్ ఎంటర్టైన్మెంట్. కానీ, బయటకు వచ్చాక కూడా అదే ఆటిట్యూడ్‌ని కంటెస్టెంట్స్ ప్రదర్శిస్తే ఎలా.? మూడో సీజన్‌కి విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ గెలవడాన్ని రన్నరప్ శ్రీముఖి ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఆ విషయాన్ని స్టేజ్ మీదనే కుండబద్దలుగొట్టేసింది.
‘ఓటమిని ఒప్పుకోను..’ అని నాగార్జున, చిరంజీవి సమక్షంలోనే శ్రీముఖి చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. పోనీ, అక్కడికేదో ఆమె ఓటమి బాధలో వుందనుకుంటే.. తాజాగా తనీష్ ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీముఖి, రాహుల్ విషయంలో చేసిన వాఖ్యలు.. ఆమె ఆటిట్యూడ్‌ని మరింతగా బయటపెడ్తున్నాయి.
రాహుల్ ఓ సందర్భంలో తన ప్రొఫెషన్ని కించపర్చాడనీ, అందుకే అతనితో హౌస్‌లో దూరం పాటించాననీ చెఫ్పుకొచ్చింది. నిజానికి, ఇలాంటి ఇన్సిడెంట్స్ బిగ్‌హౌస్‌లో జరగడం పెద్ద విషయమేమీ కాదు. ఇద్దరు వ్యక్తులు ఎక్కువ సేపు కూర్చుని మాట్లాడుకుంటే సహజంగా తలెత్తే గిల్లికజ్జాల్లాంటివే. తనను రాహుల్ అంత మాట అన్నందుకు, శ్రీముఖి.. రాహుల్‌ని పలుమార్లు నామినేట్ చేసి కసి తీర్చేసుకుంది. అది చాలక, సీజన్ అంతా నామినేట్ చేస్తాననీ ప్రకటించింది.
అంతే కాదు, పలు టాస్క్‌లు జరుగుతున్నప్పుడు రాహుల్‌ని ఎగతాళి చేసింది కూడా. ఇదంతా ఆమె గేమ్ ప్లాన్ అయి వుండొచ్చు కూడా. కానీ, షో ముగిశాక ఇంకా పాత విషయాల్ని ప్రస్తావించడం అనవసరం. ఒకవేళ ప్రస్తావనకు వచ్చినా, ‘గతం గతః’ అనేయాల్సి వుంటుంది. అదే హుందాతనం. అయితే, ఇక్కడ బిగ్ బాస్ రియాల్టీ షోపై ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ వచ్చే సీజన్ వరకూ కొనసాగించడానికే శ్రీముఖితో అలా చెప్పిస్తున్నారా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. ఓవరాల్‌గా ఇది జస్ట్ ఓ రియాల్టీ షో.! ఆ విషయం కంటెస్టెంట్స్ గుర్తుపెట్టుకుంటే మంచిది.
381496 111437This is genuinely intriguing, Youre a really skilled blogger. Ive joined your rss feed and appear forward to seeking a lot more of your magnificent post. Also, Ive shared your web website in my social networks! 735393
781662 978585I entirely agree with you about this matter. Good post. Already bookmarked for future reference. 742907
449182 974317I will tell your buddies to visit this website. .Thanks for the post. 976987