బిగ్‌హౌస్‌లో రాహుల్ సిప్లిగంజ్ పరిస్థితి శ్రీముఖి కారణంగా మరీ దారుణమైపోయింది. మొదటి నుంచీ రాహుల్‌ని శ్రీముఖి టార్గెట్ చేస్తూ వస్తున్న విషయం విదితమే. ‘బిగ్‌హౌస్‌లోకి రాకముందు నుంచే మేం స్నేహితులం..’ అంటూనే, రాహుల్‌ని శ్రీముఖి విమర్శిస్తూ వస్తోంది. శ్రీముఖి రెచ్చగొట్టడం, ఆ తర్వాత రాహుల్ నోరు జారడం.. దాన్ని హైలైట్ చేసి, శ్రీముఖి సెంటిమెంట్‌ని గెయిన్ చేయడం ఓ తంతులా మారిపోయింది.
షో ఎండింగ్‌కి వచ్చేస్తున్నా రాహుల్ విషయంలో శ్రీముఖి గేమ్ ప్లాన్ మారడంలేదు. రాహుల్, శ్రీముఖి గేమ్‌ని అర్థం చేసుకోకుండా నోరు జారేస్తూనే వున్నాడు. ఇక, తాజా ఎపిసోడ్లో శ్రీముఖి తల్లి కూడా రాహుల్ సిప్లిగంజ్ని టార్గెట్ చేయడం గమనార్హం. ‘మీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా.. మాట్లాడుకోండి.. గొడవ పడకండి..’ అంటూ రాహుల్‌కి అందరి ముందూ క్లాస్ తీసుకున్నారు శ్రీముఖి తల్లి లత. దాంతో, రాహుల్ అందరి ముందూ ఒకింత ఇబ్బంది ఫీలయ్యాడు.
అయితే, ‘నువ్వూ మా బిడ్డతో సమానమే.. నిజామాబాద్‌కి వస్తే సందడి చేద్దాం..’ అంటూ కవరింగ్ చేసేశారు శ్రీముఖి తల్లి లత. మిగతా కంటెస్టెంట్స్‌కి భిన్నంగా శ్రీముఖి తన తల్లితో ఎక్కువసేపు గేమ్ గురించి చర్చించినట్లు కన్పించింది. తొలుత శ్రీముఖిని పవర్ సేవ్‌లో వుంచి, ఆమె తల్లిని వెంటనే బయటకు పంపించేసిన బిగ్‌బాస్, ఆ తర్వాత మళ్ళీ హౌస్‌లోకి రప్పించడం.. నాటకీయంగా తయారైంది.
శ్రీముఖి విషయంలో ఒకింత ఎక్కువ స్క్రీన్‌స్పేస్ ఇవ్వడం చూస్తోంటే.. బిగ్‌బాస్ రియాల్టీ షో మొత్తం ప్రీ-స్క్రిప్టెడ్ వ్యవహారం.. అనే భావన మరింత బలపడక మానదు. శ్రీముఖి, ఆమె తల్లి మధ్య జరిగిన ఎపిసోడ్‌తో ఆ వాదనకి పదింతల బలం చేకూరిందిప్పుడు.
982209 732248Thank you for your quite very good details and respond to you. I need to verify with you here. Which isnt 1 thing I often do! I get pleasure from reading a publish that can make people think. Additionally, thanks for allowing me to remark! 126317
181539 762588The vacation delivers on offer are : believed a selection of some of the most selected and additionally budget-friendly global. Any of these lodgings tend to be really used along units may accented by means of pretty shoreline supplying crystal-clear turbulent waters, concurrent with the Ocean. hotels packages 104692
813353 170184Just wanna input on couple of general things, The web site layout is perfect, the articles is actually great : D. 801631