మెగాస్టార్ కమర్షియల్ హంగులతో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తే బాక్సాఫీస్ ఏ రేంజ్లో షేక్ అవుతుందో ‘ఖైదీ నంబర్ 150’ చూపించింది. ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేశారు.
భారీ క్యాస్టింగ్, సెట్స్, భారీ బడ్జెట్తో దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’ వంటి సినిమా తీస్తే తప్ప వంద కోట్ల గ్రాస్ క్రాస్ చేయడం కష్టమని ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాలు అనుకుంటున్న టైమ్లో… రొటీన్ కమర్షియల్ కథకు కాస్త మెసేజ్ జోడించి తీసిన ‘ఖైదీ నంబర్ 150’ కష్టమేమీ కాదని నిరూపించింది. ఆ సినిమా తర్వాత డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’తో అందరి చేత ఔరా అనిపించారు మెగాస్టార్.
లేటెస్టుగా కొరటాల శివ దర్శకత్వంలో కమర్షియల్ హంగులతో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి కొబ్బరికాయ కొట్టిన విషయం తెలిసిందే. ప్రజెంట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగులో జరుగుతున్నాయి.
సినిమాలో హీరో హౌస్ సెట్, కాలనీ సెట్, హీరోయిన్ హౌస్ సెట్ వర్క్స్ జరుగుతున్నాయి. కోకాపేటలో మెగా ఫ్యామిలీకి చెందిన స్థలంలో ఈ సెట్స్ వేస్తున్నారు. ‘సైరా’లో కొన్ని సెట్స్ కూడా అక్కడే వేసి, షూటింగ్ చేశారు. డిసెంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తార్ట. ఆల్రెడీ కొరటాల స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేశారు.
22231 310672The Twitter application page will open. This is good if youve got a few thousand followers, but as you get much more and far more the usefulness of this tool is downgraded. 897011
178690 955674if the buffalo in my head could speak german i would not know a god damm thing. What i do know is that the language of art is out of this world. 822630