అందాల భామ శ్రుతి హాసన్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆ మధ్య తన పర్సనల్ విషయాల కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది ఈ స్టార్ కిడ్. తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికాతో రిలేషన్లో ఉండటంతో ఈమె సినిమాలకు దూరంగా ఉంది. అయితే మళ్లీ సినిమాల్లో బిజీగా మారడంతో శ్రుతి తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయి దూరంగా ఉంటుందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. తాజాగా ఆమె మళ్లీ తన బాయ్‌ఫ్రెండ్ శాంతాను హజారికాతో రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా కొన్ని ఫోటోలను బయటపెట్టింది. కాగా, తాజాగా శ్రుతి హాసన్ పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శాంతాను శ్రుతిని వెనకనుంచి తన బిగి కౌగిలిలో బంధిస్తూ ఆమె మెడపై ముద్దుపెడుతున్న ఓ ఫోటోను శ్రుతి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీనికి ఆమె ఓ కామెంట్ కూడా యాడ్ చేసింది. తనకు ఇదే కావాలంటూ ఆమె చేసిన కామెంట్‌కు నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో గడిపే మూమెంట్స్‌ను ఇలా పబ్లిక్ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నావంటూ పలువురు ఆమెపై మండిపడుతున్నారు. ఏదేమైనా శ్రుతి హాసన్ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి.
962232 220990The full look of your website is wonderful, let well as the content material! 339718
184723 131857Excellent post man, keep the nice work, just shared this with my friendz 292836