అక్కినేని హీరో అఖిల్ ఇప్పటి వరకు వరుసగా చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ యంగ్ హీరో సిద్దంగా ఉన్నాడు. ఇదే సమయంలో ఈయన అయిదవ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ లో అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కూడా మార్చికి వాయిదా వేశారు.
షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సూరి మళ్లీ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. కొందరి సూచన మేరకు కథలో మార్పులు చేర్పులు చేయడం కోసం షూటింగ్ ను వాయిదా వేశారని కూడా అక్కినేని వర్గాల వారు చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో అఖిల్ 5 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సైరా నరసింహారెడ్డి తర్వాత సూరి చేయబోతున్న మూవీ ఇదే అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలను అందుకుని అఖిల్ కు సక్సెస్ను ఇస్తాడేమో చూడాలి.
463953 747412Oh my goodness! a amazing post dude. Thanks a great deal Nevertheless I is going to be experiencing trouble with ur rss . Dont know why Not able to sign up for it. Is there everybody acquiring identical rss issue? Anybody who knows kindly respond. Thnkx 447117