తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ నాలుగో వారం ఎలిమినేషన్ కి సంబంధించిన విషయం లీక్ అయింది. ఎప్పటి లాగే ఈ వారం కూడా ఎలిమినేషన్ క్యాండిడేట్ ఎవరు అనేది ముందే లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. గత సీజన్లో మొదటి వారమే ఎలిమినేట్ అయిన సరయు అందరికి షాక్ ఇచ్చింది. ఈమె ఈసారి నాలుగో వారం ఎలిమినేట్ బయటకు వచ్చేసింది.
ఈ సారి నాలుగు వారాలు ఉండడం గొప్ప విషయమే కానీ ఆమె ను అభిమానించే వారు కొందరు ఇంకా కొన్ని రోజులు సరయు ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనాలు ఆమె విషయంలో కాస్త నెగిటివ్ తో ఉన్నారు. కారణం బిందు మాధవి మరియు యాంకర్ శివ మీద ఆమె గుర్రు గా ఉంది. దానికి తోడు అందరి తో కలిసి పోయే మనస్తత్వం ఆమెది కాదు అంటూ కొందరు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఆమెకు జనాలు ఓట్లు వేయలేదని.. అందుకే ఆమె ఎలిమినేట్ అయిపోయింది అని అనిపిస్తుంది. ఆదివారం ఎపిసోడ్ లో ఆ విషయాన్ని అధికారికంగా నాగార్జున ప్రకటించనున్నాడు.
740796 72006Quite nice style and great content material material , nothing else we want : D. 479950