ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హాట్ టాపిక్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్టాండర్డ్స్ పడిపోవడం, అలాగే థమన్ తన క్వాలిటీని పెంచడం. ఒక రెండు, మూడేళ్ళ క్రితం ఈ ఇద్దరికీ పోటీ అంటే దేవి శ్రీ ప్రసాద్ కచ్చితంగా ఫస్ట్ వచ్చేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ పరంగా రొటీన్ వి ఇస్తున్నాడన్న కామెంట్స్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. అదే సమయంలో థమన్ మ్యూజిక్ స్టైల్ ను పూర్తిగా మార్చుకున్నాడు. అందుకే అప్పుడు దేవి వెనుక పడ్డ దర్సకనిర్మాతలంతా ఇప్పుడు థమన్ వైపు చూస్తున్నారు.
తాను మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ ప్లేస్ లో ఉండాలంటే కచ్చితంగా హిట్ కొట్టి చూపించాలి. అలా చూపించడానికి దేవి చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అదిరిపోయే మ్యూజిక్ అందించాడంటే కచ్చితంగా దేవి ఈజ్ బ్యాక్ అంటారు. సో కచ్చితంగా దేవి కసిగా ఈ పాటల కోసం పని చేసి ఉంటాడని అందరూ ఆశించారు. అందుకే ఈరోజు సరిలేరు నీకెవ్వరు నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుంది అన్న న్యూస్ రాగానే మహేష్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. మైండ్ బ్లాక్ సాంగ్ ఈరోజు సాయంత్రం విడుదలైంది.
దేవి శ్రీ ప్రసాద్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదగడానికి తనకున్న ప్రధాన ప్లస్ పాయింట్ దేవి పాటలు చాలా క్యాచీగా ఉంటాయి. ఫస్ట్ టైమ్ వినగానే ఎక్కేస్తాయి. అయితే ఈసారి అలా జరగలేదు. బ్లేజి, రానీనా రెడ్డి కలిసి పాడిన ఈ మైండ్ బ్లాక్ సాంగ్ అంత క్యాచీగా ఏం లేదు. అలా అని తీసిపారేసీలా కూడా ఏం లేదు. రిపీట్స్ లో ఎక్కే సాంగ్ లాగా ఉంది. శ్రీమణి, దేవి శ్రీ ప్రసాద్ కలిసి ఈ పాటను రాసారు. మాస్ సాంగ్ అంటూ మొదలుపెట్టారు కానీ సాంగ్ మొదట్లో ఉన్న ఊపు మధ్యలోకి వెళ్తే నార్మల్ గానే అనిపించింది. అయితే మధ్యమధ్యలో వచ్చే మహేష్ వాయిస్ ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఒకవైపు అల వైకుంఠపురములో సాంగ్ ఫస్ట్ టైమ్ వింటుంటేనే ఎక్కేస్తున్నాయి, మరి ఈ నేపథ్యంలో ఆ పాటల పోటీని సరిలేరు టీమ్ ఎలా అడ్డుకుంటుందో చూడాలి.
898974 876307Id need to talk to you here. Which isnt something Which i do! I really like to reading a post that need to get men and women to believe. Also, thank you for allowing me to comment! 479930
292407 750084Greetings! This really is my first comment here so I just wanted to give a quick shout out and let you know I genuinely enjoy reading by means of your blog posts. Can you recommend any other blogs/websites/forums that deal with the same topics? Thank you so a lot! 602192
517203 493724Awesome read , Im going to spend a lot more time researching this subject 756464