సినిమా హీరోయిన్స్ ఎవరిని ఎప్పుడు? ఎలా ? ఎందుకు ప్రేమిస్తారో ? ఎవ్వరికి అర్థం కాని విషయం. ఇప్పటికే పలువురు భామలు క్రికెటర్స్ తో ప్రేమాయణం సాగించి అందులో కొందరు వాళ్ళను పెళ్లి చేసుకుని సెటిలైతే.. మరికొందరేమో అప్పటికే వారికి పెళ్లవ్వడంతో కేవలం డేటింగ్ లతో సరిపెట్టుకోవడం మనం చూస్తున్నదే. ఇక హీరోలను, నిర్మాతలను, దర్శకులను ప్రేమించిన అందమైన భామలను మనం చూస్తూనే ఉన్నాం. తాజగా ఇదే కోవలో ఈ అమ్మడు ఏకంగా కొరియోగ్రాఫర్ తో లవ్వాయణం మొదలు పెట్టింది. ఇద్దరు కలిసి జోరుగా షికార్లు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. వీరిద్దరి వ్యవహారం పై ఇప్పటికే బి టౌన్ మీడియా కోడై కూస్తుంది.
ఇంతకీ ఎవరా హీరోయిన్ ? ఏమా కథ అంటే. ఆ హీరోయిన్ సనాఖాన్ ? హిందీలో పలు చిత్రాల్లో నటించిన సరైన క్రేజ్ దక్కలేదు ఈ భామకు. అయినా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన కత్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మిస్టర్ నూకయ్య చిత్రాల్లో నటించిన ఈ భామకు హిందీ బిగ్ బాస్ సీజన్ 9లో ఛాన్స్ దక్కించుకుంది. ఆ షో తో కావలసినంత పాపులారిటీ అందుకున్న సనాఖాన్ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో ప్రేమలో పడిందట. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య ఘాటు ప్రేమాయణం సాగుతుందని బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా మెల్విన్ పుట్టినరోజు సందర్బంగా ఈ అమ్మడు అతనికి ఓ ప్రేమ సందేశం పంపడంతో వీరి వ్యవహారం బయటకు వచ్చేసింది.
2009లో డాన్స్ డాన్స్ షో ద్వారా విజేతగా నిలిచిన మెల్విన్, హిందీలో పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసాడు. తాజాగా ఇతగాడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావడంతో ఈ అమ్మడి ఆనందానికి అవధులు లేవు. ఆ సంతోషాన్ని మొత్తంగా ఘాటు ప్రేమ లేఖ ద్వారా పంచుకుంది. మరి వీరి ప్రేమాయణం పెళ్లిదాకా దారితీస్తుందా లేదా మధ్యలోనే ముగుస్తోందా అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సన ఖాన్ ఇప్పటికే బాలీవుడ్ లో మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా ఆమె ఓ హిందీ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట.
995866 886528Be the precise blog in the event you have wants to learn about this subject. You comprehend considerably its almost onerous to argue to you (not that I personally would needHaHa). You undoubtedly put a new spin for a subject thats been discussing for some time. Good stuff, merely good! 47722
546086 771866I really like your post. It is evident which you have a lot expertise on this subject. Your points are effectively created and relatable. Thanks for writing engaging and fascinating material. 248669