Switch to English

‘కల్పిత’ కథ.. ఆర్జీవీ అంతులేని వ్యధ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఒకప్పుడు సంచలనాలకు మారు పేరైన రామ్ గోపాల్‌ వర్మ.. ‘ఇప్పుడు సంచనాల కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి వెనుకాడ్డంలేదు’ అనే విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. ఆర్జీవీని ఇప్పటికీ అభిమానిస్తోన్న చాలామంది జీర్ణించుకోలేని విషయమిది. ‘అంతా నా ఇష్టం.. నేనెవరికీ భయపడను..’ అని చెప్పుకునే వర్మ, ఈ క్రమంలో చాలా ‘డైనమిక్‌’గా కన్పించేందుకు ప్రయత్నిస్తుంటారుగానీ, డొల్లతనం మాత్రం ఇట్టే బయటపడిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రణయ్‌ హత్య’ ఘటనపై సినిమా తీస్తానని గతంలో ప్రకటించిన వర్మ, ఆ పనిలో ఇప్పటికే కొంత ముందడుగు వేశాడు.

కానీ, విషయం ముదిరి పాకాన పడ్డంతో, ‘అబ్బే, అది కల్పిత కథ..’ అంటున్నాడు. ‘మర్డర్‌’ పేరుతో వర్మ తీస్తోన్న సినిమా కథకి మూలం ‘ప్రణయ్‌ హత్య’. ప్రణయ్‌ భార్య అమృత, అమృత తండ్రి మారుతీరావులను పోలిన పాత్రలతో ఇప్పటికే పోస్టర్స్‌ విడుదల చేశాడు వర్మ. ఇప్పుడేమో, అసలు ఆ ఘటనకీ, తన సినిమాకీ సంబంధమే లేదని తేల్చేశాడు. ఇది ఒక్క ‘మర్డర్‌’ సినిమా విషయంలోనే కాదు, ఇటీవలి చాలా సినిమాల విషయంలో జరుగుతోంది.. అదీ వర్మ తీస్తోన్న సినిమాల విషయంలోనే కావడం గమనార్హం.

‘పవర్‌ స్టార్‌’ పేరుతో సినిమా అనౌన్స్‌ చేసి, అందులో పవన్‌ కళ్యాణ్‌ని పోలిన వ్యక్తిని పెట్టి, ‘తూచ్‌.. పవన్‌ కళ్యాణ్‌తో సంబంధం లేదు..’ అనడాన్ని ఏమనుకోవాలి.? ‘నేను చాలా తెలివైనోడ్ని..’ అని వర్మ అనుకోవచ్చుగాక. కానీ, ఇక్కడే ఆయన తన తెలివితక్కువతనాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఒకప్పుడు వర్మ ఏం చేసినా సంచలనమే.. కానీ, ఇప్పుడు ఏది సంచలనంగా మారుతుందో.. దాని చుట్టూ వర్మ ఆలోచనలు పరిగెడుతున్నాయి. ప్రణయ్‌ హత్య నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు ధైర్యముంటే అది ‘వాస్తవ గాధ’ అని చెప్పగలగాలి. కానీ, అంత ధైర్యం వర్మకెక్కడిది.?

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విషయంలోనూ వర్మ చేసిందదే. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని టైటిల్‌ పెట్టి, ఆనక టైటిల్‌ మార్చి.. వర్మ చేసిందీ అదే పబ్లిసిటీ స్టంటు. ఈ పబ్లిసిటీ స్టంట్స్‌తో సినిమాలో ‘మేటర్‌’ లేకపోయినా డబ్బులొచ్చేస్తున్నాయ్‌.. అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? ‘ఆర్జీవీ కల్పిత కథ.. ఇది ఆర్జీవీ అంతులేని వ్యధ..’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు దంచేస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...